ఆదిత్య కశ్యయపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినం రథసప్తమి. ఇతర మాసాలలో వచ్చే సప్తమి తిధుల కన్నా మాఘమాసంలో వచ్చే ఈ సప్తమి ఎంతో విశిష్టమైంది. అంతేకాదు రధసప్తమి నాడు సూర్యుడు తన రథాన్ని ఉత్తరం దిక్కుకు మళ్లించినరోజు. ఈ రోజు నుంచే సూర్యుని తీక్షత క్రమేణా పెరుగుతుంది. సమస్త ప్రాణకోటి జీవనాధారానికి, సకల జీవుల సంపూర్ణ ఆరోగ్యానికి సూర్యభగవానుడే మూలం. సూర్యుడు ఉదయం బ్రహ్మ స్వరూపముగానూ, మధ్యాహ్నం శివుడుగాను, సాయంత్రం వేళ విష్ణువుగానూ ఉంటాడని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ప్రతిరోజూ ప్రత్యక్ష దైవం అయిన సూర్యభగవానుడిని అర్చించిన వారికి ఆయురారోగ్యఐశ్వర్యాలు ప్రాపిస్తాయంటారు.
No comments:
Post a Comment