Thursday, 28 April 2016
Sunday, 24 April 2016
Tuesday, 19 April 2016
Sunday, 17 April 2016
ఏది నిజమైన పంచాంగం ?
ఉగాది రోజు రెండుతెలుగు రాష్ట్రాలలోని ప్రధాన రాజకీయ పార్టీలు వేర్వేరుగా పంచంగ శ్రవణం చెప్పించుకున్నారు. అయితే ఒక పార్టీ పంచాంగ శ్రవనానికి మరో పార్టీ పంచాంగ శ్రవనానికి పొంతన లేకుండా విరుద్ధమైన పంచాంగ శ్రవణాలు వినిపించారు పండితులు. 'ఈ సంవత్సరమంతా రాష్ట్రంలో మీరే నెంబర్ వన్' అని పార్టీ అధ్యక్షుల వారిని ఆకాశానికి ఎత్తేశారు. శుభకార్యాలయాలలో మన తెలుగువారి సంప్రదాయ కుటుంబాలు పంచాగాన్ని అత్యంత కీలకంగా భావిస్తారు. అలాంటి పంచాగాన్ని ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేసుకుని, ప్రజలను అయోమయానికి గురిచేయడం పండితులకు న్యాయమా? ఏ పంచాంగాన్ని ఆచరించాలో, దేనిని పట్టించుకోకూడదో తెలియని పరిస్థితిలోకి ప్రజలను నెట్టేశారు. అంతా డబ్బు మహిమ.
Thursday, 14 April 2016
శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు !
రమణీయమైన రామకథను ఎందరెందరో
కవులు ఎన్నెన్నో భాషల్లో వ్రాసి చరితార్థులయ్యారు. కోదండరాముని కథని
ఎన్నిమార్లు విన్నా, చదివినా తనివి తీరదు. రామబాణం
రక్షిస్తుంది... రామహస్తం దీవిస్తుంది... రామ పాదం నడిపిస్తుంది...రామమంత్రం
సుఖశాంతులను అందిస్తుంది. రామ నామం మధురం... మధురాతి మధురం. సీతారాముల కల్యాణం కమనీయం, రమణీయం. సీతారాముల కల్యాణ వేడుకల్లో మనం కూడా మమేకమవుదాం... సకల శుభాలను పొందుదాం!
-కాయల నాగేంద్ర
Wednesday, 13 April 2016
Monday, 11 April 2016
అనురాగ శివుడు !
శివతత్వమంటే...ప్రేమతత్వం
శివతత్వాన్ని అర్థం చేసుకోవడం అంటే ..
శివుడినిలా మెలగడం !
పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలంటే ...
నోరారా 'శివా' అని స్మరిస్తూ ...
చెంబుడు నీళ్ళు ఆయన శిరస్సు పైన పోస్తే...
ప్రసన్నుడయి పోతాడు
మనం గోరంత అడిగితే..
కొండంత ఇచ్చేబోళాశంకరుడు
'శివా' అని స్మరిస్తే ...
శుభకరం ...మంగళకరం !
Subscribe to:
Posts (Atom)




