ఉగాది రోజు రెండుతెలుగు రాష్ట్రాలలోని ప్రధాన రాజకీయ పార్టీలు వేర్వేరుగా పంచంగ శ్రవణం చెప్పించుకున్నారు. అయితే ఒక పార్టీ పంచాంగ శ్రవనానికి మరో పార్టీ పంచాంగ శ్రవనానికి పొంతన లేకుండా విరుద్ధమైన పంచాంగ శ్రవణాలు వినిపించారు పండితులు. 'ఈ సంవత్సరమంతా రాష్ట్రంలో మీరే నెంబర్ వన్' అని పార్టీ అధ్యక్షుల వారిని ఆకాశానికి ఎత్తేశారు. శుభకార్యాలయాలలో మన తెలుగువారి సంప్రదాయ కుటుంబాలు పంచాగాన్ని అత్యంత కీలకంగా భావిస్తారు. అలాంటి పంచాగాన్ని ఎవరికి తోచిన విధంగా వారు తయారు చేసుకుని, ప్రజలను అయోమయానికి గురిచేయడం పండితులకు న్యాయమా? ఏ పంచాంగాన్ని ఆచరించాలో, దేనిని పట్టించుకోకూడదో తెలియని పరిస్థితిలోకి ప్రజలను నెట్టేశారు. అంతా డబ్బు మహిమ.
No comments:
Post a Comment