”శోధిని”

Wednesday, 19 August 2015

అవినీతి జలగలు !

ప్రభుత్వ ఉద్యోగాలు 
పని తక్కువ 
పరిహారం ఎక్కువ 
లక్షల్లో జీతాలు 
అయినా లంచాలు 
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!

 

Tuesday, 18 August 2015

ఇది మా ఆచారం ! ( జోక్ )

ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ జరుగుతోంది.  బయట బందువులందరూ భాధను దిగమింగుతూ... ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.  ఇంతలో నర్స్ పెద్ద పూలదండతో ఆపరేషన్ థియేటర్ లో వెళుతుంటే, పేషెంట్ బంధువులకు అనుమానం వచ్చి...                             "పూలదండ ఎందుకండీ " ఆతృతగా అడిగారు.
"డాక్టర్ గారు తొలిసారిగా ఆపరేషన్ చేస్తున్నాడు.   విజయవంతమైతే డాక్టర్ గారికి వేసి అభినందనలు చెబుతాం.  ఫెయిలయితే పేషెంట్ మెడలో వేసి సానుభూతి వ్యక్తపరుస్తాం.  ఇది మా ఆసుపత్రి ఆచారం."

Sunday, 16 August 2015

అనాధుల పాలిట ఆపద్భాందవులు !




కనిపెంచిన తల్లిదండ్రులను నిర్ధాక్షిణంగా ఇంటినుంచి తరిమేస్తున్న కొడుకులు కొందరైతే, కన్నపేగును తెంచుకొని పుట్టిన  బిడ్డల్ని అనాధలుగా రోడ్డుపై వదిలేస్తున్న తల్లిదండ్రులు మరికొందరు. ఇతర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకొచ్చి పట్టణాలలో వదిలేసేవారు ఇంకొందరు. ఇలా తమ పేగుబంధాన్ని దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో అనాధుల పాలిట ఆపద్భాందవులు, మానవత్వం ఉన్న మనుష్యులు ఇంకా ఉన్నారని 'ఆపన్న హస్తాలు' ముఖపుస్తకం ద్వారా కొందరు మిత్రులు తెలియజేస్తున్నారు.   ప్రతి నెలా తమ సంపాదనలో కొంత డబ్బు కనీసం వంద రూపాయలు తగ్గకుండా అనాధుల కోసం కేటాయిస్తూ ఉడతాభక్తితో సమర్పించుకుంటున్నారు. వారందరికీ కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.


Friday, 14 August 2015

మదినిండా ...మువ్వన్నెల జెండా!



 నెత్తురు మడుగులో దొర్లుకుంటూ...
ఊపిరి ఉన్నత వరకు శత్రువులతో పోరాడి
మనకోసం అమరులైన వీరులకు జోహార్లు !
వారి త్యాగాన్ని తలుచుకుంటూ...
త్రివర్ణ పతకాన్ని ఎగురవేద్దాం!!
మనకోసం నిరంతరం శ్రమిస్తున్న
వీరజవానులకు అండగా నిలుద్దాం !!!