”శోధిని”

Tuesday, 3 December 2013

తెలివైన భర్త !

"మీరు రోజు తాగి ఎంజాయ్ చేస్తూ... నన్ను మాత్రం వంటింటి                       కుందేలును చేశారు" చిర్రుబుర్రు లాడింది తాయారు.
 
"నేను తాగి సుఖపడుతున్నాననే కదా నీ అనుమానం. ఒక్కసారి ఈ మందు రుచి చూడు తెలుస్తుంది"  కొంచెం గ్లాసులో వంపి ఇచ్చాడు సుబ్బారావు.

"ఛీ... ఇంత ఛండాలంగా వుందేమిటి?నాలుక మంట పుడుతోంది...ఎలా         తాగుతున్నారండీ!" ఆముదం తాగిన దానిలా ముఖం పెట్టింది తాయారు.  

"ఏంచేయమంటావు తాయారు... నువ్వు ఇంటి పనిలో కష్టపడుతుంటే, 
నేను మాత్రం ఎలా సుఖపడతాను" భాదపడుతూ చెప్పాడు  తెలివైన సుబ్బారావు.           



Saturday, 30 November 2013

పవిత్రబంధం!

 
అందచందాలతో...  
పనిలేకుండా 
కులమతాలతో... 
సంబంధం లేకుండా 
మల్లెపువ్వులాంటి 
స్వచ్చమైన మనసుతో 
చేసే బంధం పవిత్రబంధం!
ఆ ప్రేమ బంధంలో ...  
 చల్లనిచూపులు...   
మధురమైన పలుకులు... 
ఆప్యాయతానురాగాలు... 
చిరుదరహాసాలు...ఉంటే చాలు
ఆ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది  
అలాంటి ప్రేమను పొందినవారి...  
మనసు ఎప్పుడూ పరిమళిస్తూ ఉంటుంది.  

Wednesday, 27 November 2013

"తల్లీ- కూతుళ్ళు"


"అమ్మా... మీ అల్లుడు రాత్రిపూట లేటుగా వస్తున్నాడే!"
"నా పెళ్ళయిన కొత్తలో మీ నాన్నగారూ కుడా ఇలాగే ఆలస్యంగా వచ్చేవాడు తెలుసా?"
"ఆ అలవాటు ఎలా మాన్పించావ్?"
"ఏముంది ఓ రోజు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టాడు 'మా వారు వచ్చే వేళయింది' అన్నాను. అంతే--- 
ఆ మర్నాడు నుంచి చీకటి పడగానే బుద్దిగా ఇంటికి వచ్చేవాడు.



Sunday, 24 November 2013

"కొంటె కూతురు"


అల్లుడికి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కబురు వస్తే హడావుడిగా వెళ్ళిన అత్తగారు 'అసలేమయింది అల్లుడు గారూ... ఏక్సిడెంటా?' అని అడిగితే,
తన భార్యవైపు చూపించాడు అల్లుడు 
'ఎమైందో నువ్వైనా చెప్పవే' అని కూతుర్ని అడిగితే.
'నువ్వేకదమ్మా ఆయనితో ఏమైనా తేడా వస్తే నోరు విప్పవోద్దన్నావు- అందుకే చేతికి పని చెప్పా' 
అంది కొంటెకూతురు. 

Friday, 22 November 2013

మాయల మరాఠీలు!

మన నాయకులు 
మాయల మరాఠీలు 
మాయమాటలతో 
ప్రజలను ఏమార్చి
పబ్బం గడుపుకునే  
ఘనాపాటీలు!
పదవికోసం 
ఎన్నో వేషాలు
గడ్డి తినడానికే 
ఎన్నోమోసాలు 
అందుకే ... 
దేశం పతనం వైపు 
పరుగులు తీస్తోంది 

Saturday, 16 November 2013

కార్తీక పౌర్ణమి

దీపావళి పండుగ అనంతరం మహిళలు అత్యంత భక్తి  శ్రద్ధలతో  జరుపుకునే పండుగ కార్తీక పౌర్ణమి.  కార్తీక మాసంలో వచ్చే పున్నమి చాలా పవిత్రమైనది.  అందుకే ఈ రోజున పూజలు, అభిషేకాలు, వ్రతాలు, దీపారాధనలతో  గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ  ఉంటాయి.  కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన  పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు.  కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికర మైనందువల్ల ఆన్ని దేవాలయాలలో దీపాలను వెలిగిస్తారు. 

అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!

మల్లెల సుగంధం !

 
అందమైన నీ రూపం 
సౌందర్యానికి ప్రతిరూపం 
మదిని మురిపించే 
మల్లెల సుగంధం!