”శోధిని”

Friday, 1 November 2013

అందరికీ దీపావళి శుభాకాంక్షలు!



ఏ శుభకార్యానికైన దీపం వెలిగించిన తర్వాతనే పూజ ప్రారంభిస్తాం. దీపావళి పర్వదినాన ఇంట , బయట దీప జ్యోతుల వరుసలతోనే దీపావళి ఆరంభమవుతుంది.  దీపం వెలుగుకు, జ్ఞానానికి ప్రతీక.  అమావాస్య చీకట్లను పారద్రోలుతూ ఇండ్ల ముందు, పూజా గృహంలో వెలిగే దీపాల వరసలు సర్వ శుభాలను అనుగ్రహిస్తాయి. ఈ రోజు లక్ష్మిదేవిని పూజించడం కృతయుగం నుండి వస్తున్నా సంప్రదాయం.  శ్రీ మహాలక్ష్మిని  కొలవని, ధ్యానించని ఇల్లూ, వాకిలి ఉండవు. మనం అనుభవించే సిరిసంపదలు ఆ తల్లి ప్రసాదించినవేనని మనందరికీ తెలుసు.  ఆదేవిని స్తుతించినా, పూజించినా ఆమె అనుగ్రం మనికి తప్పక లభిస్తుంది.  తద్వారా సకల సంపదలు మన సొంతమవుతాయి.  దేశమంతా ఆనందోత్సాలతో జరుపుకునే దీపావళిని వెలుగు తోరణాలతో, వెలుగులుచిమ్మే బాణాసంచాతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఘనంగా జరుపుకుంటాం. 

Sunday, 20 October 2013

ప్రేమలోకం !

 
ప్రకృతి కంటే...
 అందమైనది
పాలుకంటే... 
స్వచ్చమైనది 
తేనెకంటే... 
మధురమైనది 
మల్లెపువ్వులాంటి 
మీ మనసు 
అందుకే,
వెన్నెల సాక్షిగా...
నీ చిరునవ్వు సాక్షిగా ... 
మనసు నిండా
నిన్నే ధ్యానిస్తున్నా 
ప్రేమ పుష్పాలతో 
నిత్యం పూజిస్తున్నా! 

Saturday, 12 October 2013

మా నాయకులకు జ్ఞానోదయం కలిగించు తల్లీ!

 
'అమ్మా' అని ఆర్తిగా పిలిచినవారిని అక్కున చేర్చుకునే జగజ్జననీ... దారితప్పి తిరుగుతున్నరాష్ట్ర రాజకీయనాయకులకు సరైన దారి చూపించు.  తమ పదవులకోసం రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న నాయకుల కళ్ళు తెరిపించు.  ఒకప్పుడు అభివృద్ధిలో ప్రధమ స్థానంలో ఉన్న  రాష్ట్రం, ఇప్పుడు చిత్తసుద్ధి లేని నాయకుల వలన అభివృద్దిలో కుంటుపడింది.  ఐక్యమత్యమే మహాబలం అనే విషయాన్ని మా నాయకులకు భోదించి, స్వార్థపూరిత రాజకీయ బుద్దిని విడనాడేటట్లు చూడు తల్లీ. ఒకరి పైన ఒకరు బురద చల్లుకోకుండా వారిలోని గర్వం, అహంకారం, ఇర్ష్య, అసూయ లాంటి శత్రువులను రూపుమాపి, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయి భవానీ.   మా నాయకులకు జ్ఞానోదయం కలిగించి, మా మనస్సులలోని అశాంతిని తొలగించి ప్రశాంతతను ప్రసాదించు విశ్వ మాతా!

మిత్రులందరికీ ....విజయదశమి శుభాకాంక్షలు!


Thursday, 10 October 2013

శ్రీవారి స్వర్ణరథం!

 
తిరుమలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా  శ్రీ వేంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన నూతన స్వర్ణ రథాన్ని గురువారం మాడ వీధుల్లో ఊరేగించారు. 

ప్రేమ మాధుర్యం!


                                                                                             
                                                      









హరివిల్లులా విరిసి...
విరిజల్లులా కురిసి...
మదిలో సందడి చేశావు
మనసంతా మల్లెలు పరచి... 
యెదలో అలజడి రేపి... 
ప్రేమ మాధుర్యాన్ని 
నాలో నింపావు 
అందుకే నీ దరహాసాన్ని 
నా హృదిలో ముద్రించుకున్నాను 
నీ రూపలావణ్యాన్ని 
శాశ్వతంగా నాలో నింపుకున్నాను 
మన ప్రాంతాలు వేరైనా 
మన  ప్రేమకు హద్దులు లేవు 
నా పయనం మాత్రం నీ వైపే!