ఏ శుభకార్యానికైన దీపం వెలిగించిన తర్వాతనే పూజ ప్రారంభిస్తాం. దీపావళి పర్వదినాన ఇంట , బయట దీప జ్యోతుల వరుసలతోనే దీపావళి ఆరంభమవుతుంది. దీపం వెలుగుకు, జ్ఞానానికి ప్రతీక. అమావాస్య చీకట్లను పారద్రోలుతూ ఇండ్ల ముందు, పూజా గృహంలో వెలిగే దీపాల వరసలు సర్వ శుభాలను అనుగ్రహిస్తాయి. ఈ రోజు లక్ష్మిదేవిని పూజించడం కృతయుగం నుండి వస్తున్నా సంప్రదాయం. శ్రీ మహాలక్ష్మిని కొలవని, ధ్యానించని ఇల్లూ, వాకిలి ఉండవు. మనం అనుభవించే సిరిసంపదలు ఆ తల్లి ప్రసాదించినవేనని మనందరికీ తెలుసు. ఆదేవిని స్తుతించినా, పూజించినా ఆమె అనుగ్రం మనికి తప్పక లభిస్తుంది. తద్వారా సకల సంపదలు మన సొంతమవుతాయి. దేశమంతా ఆనందోత్సాలతో జరుపుకునే దీపావళిని వెలుగు తోరణాలతో, వెలుగులుచిమ్మే బాణాసంచాతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఘనంగా జరుపుకుంటాం.
No comments:
Post a Comment