జనవరి 8, 2013 భారత్-పాక్ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న మన సైనికులు శ్రీ హేమరాజ్, శ్రీ సుధాకర్ సింగ్ లు శత్రువుల తూటాలకు వీర మరణం పోందారు.శత్రుమూకల కుసంస్కార తీరుకు తలలులేని మొండాలతో నేలకొరిగారు. ఈ దుశ్చర్యను ప్రతి ఒక్కరు ఖండించాలి. మన కోసం ప్రాణాలర్పించిన ఈ వీరులకు గణతంత్ర దినోత్సవ సందర్భంగా వందనాలు సమర్పించుకుందాం. వీరి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తాం!
అనుబంధం పెంచిన ప్రియతమా... అనురాగం పంచిన నా ప్రాణమా... కురిసే మంచులో విరిసే పువ్వులా ... నీ ప్రేమ కుసుమాలు... పరిమళాలను వెదజల్లుతుంటే... నిత్యం నీ ప్రేమ వర్షంలో... తడిసి ముద్దవుతున్నా!
నూతన సంవత్సరం అంటే ఒక సంవత్సరాన్ని వెనక్కి పంపి ఇంకొక సంవత్సరాన్ని ముందుకు తీసుకురావడం . వెళుతున్న పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, వస్తున్న కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం.
గత సంవత్సరం లో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశయాలతో అడుగు పెడదాం. ఈ నూతన సంవత్సరం మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికి సకల శుభాలు కలగాలని ఆశిస్తూ ఆంగ్ల నూతన సంవత్సర (2013) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!
ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ఏకైక వేడుక ఇదే కాబట్టి, మన జీవితంలోనే కాకుండా ఎదుటి వారి జీవితంలో కూడా ఈ నూతన సంవత్సరం ఆనందం వెల్లివిరియాలని ఆశిద్దాం.
దేశ రాజధానిలో సాముహిక అత్యాచారానికి గురయిన బాధితురాలు, సింగపూర్ లో చికిత్స పొందుతూ శనివారం తెల్లరారుజామున తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ద్రువీకరించారు. ఆమె మృతి పట్ల నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను. ఇప్పటికైన విచారణ అంటూ కాలయాపన చేయకుండా ఈ ఘటలకు కారకులయిన మృగాలను వెంటనే ఉరి తీయాలి. అప్పుడే ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.