Wednesday, 26 December 2012
Monday, 24 December 2012
Monday, 17 December 2012
ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది.
ఉపాద్యాయ వృత్తి ఏంతో గౌరప్రదమైనది. తల్లిదండ్రుల తర్వాత మనిషి వ్యక్తిత్వ వికాసంలో అద్యాపకులదే కీలక పాత్ర.. అంతేకాకుండా సమాజంలోని ప్రతి రంగంలోనూ ఉపాధ్యాయుని ప్రభావం కచ్చితంగా ఉంటుంది. తనను తాను సంస్కరించుకుంటూ సమాజాన్ని సంస్కరించాలి కాబట్టి, ఏ మాత్రం నిర్లక్షంగా వ్యవహరించినా... ఒక తరం తీవ్రంగా నష్టపోతుంది. అందుకే పిల్లలకు పాఠాలు చెప్పే గురువులు భాద్యతగా వ్యవహరించాలి. విద్యార్థులలో ఆసక్తిని రేకెత్తించే స్థాయిలో భోదనలు చేయాలి. విధినిర్వహణలో నిబద్దత, క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించాలి.పాఠ్యంశాలలోని మాధుర్యాన్ని విద్యార్థులకు చవి చూపించాలి. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే అందులో ముఖ్యపాత్ర అద్యాపకులదే. విద్యార్థులకు వినయ విధేయతలతోపాటు విద్యాబుద్దులు నేర్పి వారి భవిష్యత్తుకి బాటలు వేసేది ఉపాద్యాయులే. దేశం ప్రగతి పథంలో నిలబడాలంటే విద్యార్థులకు మంచి విద్యనందించే అధ్యాపకులు నేడు ఎంతో అవసరం. విద్యార్థులు కుడా గురువులను గౌరవించినప్పుడే వారి ఆశయం నెరవేరుతుంది.
Monday, 10 December 2012
అపార్ట్ మెంట్లో అగ్ని ప్రమాదాలు.
గత నెల నవంబర్ హైదరాబాద్, మణికొండలో ఒక సీరియల్ చిత్రీకరణ కోసం వేసిన షెడ్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. తర్వాత పక్కనే ఉన్న 'బాబా నివాస్ అపార్ట్ మెంట్' కు మంటలు అంటుకోవడంతో ఓ పసికందువు తో పాటు ఆరు నిండు ప్రాణాలు బలై పోవడం జరిగింది. ఎంతకీ షెడ్ నుంచి అపార్ట్ మెంట్ కు మంటలు ఎలా వ్యాపించాయంటే...అపార్ట్ మెంట్లో ఆరవేసిన దుస్తులు అంటుకోవడంతో అపార్ట్మెంట్ కు మంటలు వ్యాపించడం జరిగిందట. లక్షల రూపాయలను పోగు చేసి ఫ్లాట్ ను కొంటారు. తన ఫ్లాట్ ను ఎలా చూసుకుంటారో అదేవిదంగా అపార్ట్ మెంట్ ను కుడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం నిర్లక్షంగా ఉన్నా తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒకరి నిర్లక్షం కారణంగా మొత్తం అపార్ట్ మెంట్ వాసులు నష్టపోయారు. అపార్ట్ మెంట్ అన్నాక అందులో నివసించే ప్రతి ఒక్కరికి భాద్యత ఉంటుందని మరవద్దు.
Saturday, 8 December 2012
Subscribe to:
Posts (Atom)


























