Tuesday, 14 February 2012
పేద రోగులను కాపాడండి!
పేద రోగులను కాపాడండి!
జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా శుక్రవారం నుంచి అత్యవసర
వైద్య సేవలను బహిష్కరించడంతో ప్రభుత్వ ఆసుపత్రులల్లో సకాలంలో వైద్యం
అందక రోగులు విలవిలలాడుతున్నారు. ఇటు జూనియర్ డాక్టర్లు భీస్మించు కోవడం, అటు ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవడంతో అనేకమంది రోగుల
ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. డబ్బున్నవాళ్ళు కార్పోరేట్ ఆసుపత్రుల్లో
వైద్యం చేయించుకుంటుంటే, పేద రోగులు మాత్రం దిక్కు తోచక ప్రాణాలు పోగొట్టు కుంటున్నారు. ఇంత జరుకుతున్నా జూనియర్ డాక్టర్స్ లోనూ,
ప్రభుత్వంలోనూ చలనం లేకపోవడం బాధాకరం. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులల్లో రోగుల అవస్థలు వర్ణణాతీతం. ఇప్పటికైనా అమాయక పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని జూనియర్ డాక్టర్లు వెంటనే సమ్మె విరమించి, చర్చల ద్వారా తమ డిమాండ్లను పరిష్కరించుకోవాలి. ప్రభుత్వం కూడా
బెట్టుకు పోకుండా ఒక మెట్టు దిగి సమ్మెను విరమింప జేయాలి.

Sunday, 12 February 2012
ప్రేమోత్సవం
ప్రేమ పక్షులు ఎంతో ఆశగా ఎదురుచూసే రోజు ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే. ప్రేమ జంటలు ఒకరిపట్ల ఒకరికి గల ప్రణయ భావాలను వ్యక్త పరచే ఉత్సవం ఈ పండుగ. జీవితంలో ప్రతి మనిషికి ఏదో ఒక దశలో కలవడం, అది ప్రేమగా మారడం పరిపాటే. మనసులో ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని నింపే ప్రేమ గురించి యువతీయువకులు ఎన్నెన్నో కళలు కంటారు. కోరుకున్న వారిలో ఎన్నో ఆనందానుభూతులు అనుభవించాలని ఉవ్విళ్ళురుతారు. తన మనసు మెచ్చినవారికి అందమైన కానుకలు, గ్రీటింగ్ కార్డులు అందిస్తూ ఆనందంతో బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా గాలిలో తెలిపోతుంటారు. ప్రేమ చిహ్నమయిన గులాబీలను అందిస్తూ అనిర్వచనీయమైన అనుభూతిని పొందుతారు. ఒకరిపట్ల ఒకరికున్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలను తీయని మాటల్లో వ్యక్త పరచినప్పుడు కలిగే ఆనందం వర్ణణాతీతం. తొలిచూపుల్లొ చూపులు కలిసి ప్రేమ పుట్టడం, ఆ ప్రేమ చివరిదాకా నిలిచి ఉండడమే స్వచ్చమైన ప్రేమ.
ప్రేమ అంటే రెండు మనసులు నిజాయితీగా, నమ్మకంతో ఒకడవడం. ఆ నమ్మకాన్ని జీవితకాలం నిలబెట్టుకోవడం. ఒకరిపట్ల ఒకరికి పూర్తి విశ్వాసం ఉంటే ఆ ప్రేమ కలకాలం నిలుస్తుంది. స్వచ్చమైన ప్రేమకు ఏ వాలెంటైన్స్ డేలు అక్కర్లేదు. నిజమైన, నమ్మకమైన ప్రేమకు ప్రతిరోజూ వాలెంటైన్స్ డేనే. ప్రేమ కోసం పరితపించి ప్రాణ త్యాగం చేసిన వాలెంటైన్స్ డే. స్మృతి చిహ్నంగా ప్రేమికులు ఫిబ్రవరి 14 న ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటున్నారు. కాని, ఈ విషాదాన్ని పండుగగా జరుపుకోవడం ఏమిటి? అదే ప్రేమ విజయం సాధిస్తే, పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది. విషాదం నింపిన రోజున వాలెంటైన్స్ కి రెండు నిముషాలు మౌనం పాటిస్తే అతని ఆత్మ సంతోషిస్తుంది. అలా కాకుండా పండుగ చేసుకుంటే అతని ఆత్మ ఘోషిస్తుంది. విషాదం నింపిన రోజును ప్రేమికులు పండుగ చేసుకోవడం సబబేనా! ప్రతి ప్రేమ జంట తొలిసారిగా ప్రేమలో పడిన రోజును పండుగ చేసుకుంటే దానికొక అర్థం ఉంటుంది. ఆ ప్రేమోత్సవాన్ని ప్రతి ఏడాది జరుపుకుంటే అదే ప్రేమికుల దినోత్సవం అవుతుంది.
Wednesday, 25 January 2012
63 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!

మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు గణతంత్ర దినోత్సవం. కుల-మత, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జాతీయ పండుగ. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం పరిపాలించేందుకు 1950 జనవరి, 26 న రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు.
ఎందరో మహానుభావుల త్యాగఫలం వలన మనకు గణతంత్ర రాజ్యం ఏర్పడింది. మన దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు మన పరిపాలనా విధానం బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారం జరిగేది. మన రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా గణతంత్ర దినోత్సవం జరిగింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది.
గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కానీ, ఆ అర్థం కాస్త రాజకీయనాయకులే ప్రభుత్వం, ప్రభుత్వమే రాజకీయనాయకులుగా మారిపోయింది. అంతా రాజకీయ మహిమ. 63 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.
Subscribe to:
Posts (Atom)