Thursday, 27 May 2021
Thursday, 13 May 2021
రంజాన్ శుభాకాంక్షలు!
శుభాలు కురిపించే శుభప్రదమైన రంజాన్
మాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది… హృదయంలో భక్తిభావం
ఉప్పొంగుతుంది. మనసు, తనువూ తన్మయత్వంతో పులకించి పోతుంది.
ఈ పవిత్ర
మాసంలోనే ఖురాన్ గ్రంధం అవతరించడంతో ఈ
గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే రంజాన్ మాసం పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే
రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను అందించాలని కోరుకుంటూ.. రంజాన్ శుభాకాంక్షలు!
Saturday, 27 March 2021
Wednesday, 10 March 2021
మహా శివరాత్రి శుభాకాంక్షలు!
శివుడు లింగరూపంలో ఉద్భవించిన పుణ్యదినం మహా శివరాత్రి. మంగళకరమైన మహా శివరాత్రి నాడు శివునికి అభిషేకం, పగలు ఉపవాసం, రాత్రి జాగారణ చేసి భక్తితో కొలిచిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు, సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే శివుని కరుణాకటాక్షం తప్పక లభిస్తుంది. 'ఓం నమశ్శివాయ' అనే పంచాక్షరీ మంత్రం అజ్ఞానంధకారాన్ని పోగొట్టి మోక్షానిస్తుంది. ఈ పర్వదినాన అందరికి శంకరుని అనుగ్రహం లభించాలని కోరుకుందాం.







