Thursday, 15 February 2018
Tuesday, 13 February 2018
"ప్రేమికుల రోజు"
ప్రేమికుల రోజు కేవలం యువతీయువకులకే పరిమితం కాదు. స్వఛ్ఛమైన ప్రేమను పంచే అన్ని వయసులవారిలోనూ ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రేమ కలగవచ్చు. ఈ విధంగా ప్రకృతిలోని జీవులన్నీ ప్రేమకు అర్హులే! ప్రేమ 'వన్ సైడ్ లవ్' కాకుండా ఇరువైపులా ఉంటే, అది పవిత్రంగా ఉంటుంది. అలా కాకుండా ఒకవైపే ప్రేమ వుంటే... కోరి చుక్కులను, సమస్యలను తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇరువైపులా పవిత్రమైన ప్రేమ ఉన్నవారే నిజమైన ప్రేమికులు. ప్రేమకు పద్ధతులు, హద్దులు, విలువలతోపాటు బాధ్యతలు ఉండాలి. ప్రేమంటే సరైన వ్యక్తిని ఎన్నుకోవడం కాదు. మనం సరైన వ్యక్తిగా ఉండాలి. ప్రేమంటే కేవలం తీసుకోవడం కాకుండా ఇవ్వడం కూడా తెలిసుండాలి. స్వఛ్ఛమైన ప్రేమ లేనిచోట మానవత్వం ఉండదు. ప్రేమ సహజంగా ప్రకృతి పులకించేలా పుట్టాలి. ప్రేమతత్వాన్ని , ప్రేమలోని గొప్పతనాన్ని తెలుసుకోగలిగినవారే నిజమైన ప్రేమికులవుతారు.
Monday, 12 February 2018
అభిషేక ప్రియుడు
మహాదేవుని మహిమాన్విత రాత్రి, సకలలోకాలకు శుభరాత్రి... మహాశివరాత్రి. బ్రహ్మ, విష్ణువుల మధ్య వివాదం పరిష్కరించడానికి జ్వలాస్తంభంలో తేజోలింగ రూపంలో ఆవిర్భవించాడు శివుడు. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్థశిని భక్తులు భక్తిశ్రద్దలతో పగలంతా ఉపవాసం వుండి, రాత్రంతా ప్రార్థనలు, పూజలు, అభిషేకాలతో జాగారం చేస్తారు. లేతమారేడు దళాలను, ధూపదీపవైవేద్యాలు, తాంబూల ఫలాలను శివునికి సమర్పించుకుంటారు. ఇవన్నీ పరమేశ్వరుడుకి ఎంతో ప్రీతికరం. శివ స్తోత్రము తెలియనివారు భక్తిశ్రద్దలతో ‘ఓం నమశ్శివాయ’ అని స్మరిస్తూ, శివసాన్నిధ్యం పొందగలుగుతారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు కాబట్టి, రెండుమారేడు దళాలు... దోసెడు నీళ్ళు శివలింగం పైన పోసి, కొంచెం భస్మం రాస్తే చాలు ఆయన పొంగిపోతాడు...కోరిన వరాలు ఇస్తాడు. శివరాత్రి నాడు శివారాధన మించిన పుణ్యం లేదంటారు.
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు !
మీకు, మీ కుటుంబసభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు !
Sunday, 28 January 2018
మా ఇంట మహాలక్ష్మీదేవి
శ్రీ మహాలక్ష్మిని కొలవని, ధ్యానించని ఇల్లూ, వాకిలి ఉండవంటే అతిశయోక్తికాదు. మనం అనుభవించే సిరిసంపదలు ఆ తల్లి ప్రసాదించినవేనని మనందరికీ తెలుసు. ఆ దేవిని స్తుతించినా, పూజించినా ఆమె అనుగ్రహం తప్పక లభిస్తుంది. తద్వారా సకల సంపదలు మన సొంతమవుతాయి. సృష్టి, స్థితి లయకారిణి అయిన అమ్మవారు అనంత శక్తి స్వరూపిని. ఈ ప్రపంచమంతా సర్వం తానై ఇమిడి ఉంది. అమ్మ కరుణ ఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ క్షణంలో మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మిని భక్తితో పూజించి, నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన వారింట అమ్మవారు నిత్యం కొలువై ఉంటుందని ప్రజల విశ్వాసం.
Thursday, 25 January 2018
"నేను - నాదేశం ...పవిత్రభారతదేశం"
మిత్రులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు!
Tuesday, 23 January 2018
ప్రత్యక్ష దైవం పుట్టినరోజు
త్రిమూర్తి స్వరూపుడయిన సూర్యభగవానుడు ఆకాశాన జ్యోతి రూపంలో వెలుగుతూ దర్శనమిచ్చే పర్వదినం 'రథసప్తమి'. ప్రాణులకు వెలుగును ప్రసాదించి, తూర్పు దిక్కున తన లేలేత కిరణాలను ప్రసరింపచేస్తూ ప్రపంచమంతటా ప్రకృతి సౌందర్యంతో విలసింపజేస్తాడు. వెలుగును ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడు జయంతి సందర్భంగా మిత్రులందరికీ 'రథసప్తమి' శుభాకాంక్షలు!
Saturday, 13 January 2018
Subscribe to:
Posts (Atom)







