Tuesday, 5 July 2016
Monday, 4 July 2016
Sunday, 3 July 2016
దాంపత్యం !
దంపతుల మద్య కలహాలు నీటిలో కెరటాల్లాంటివి.
అవి అలా వచ్చి ఇలా పోతుండాలి. అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు వస్తేనే
ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే వాళ్ళ అనుబంధం మరింత దృఢమై అన్యోన్యంగా ఉండగలుగుతారు. అయితే భార్యాభర్తల మధ్య వచ్చే
గొడవలు ఆరోగ్యకరంగా ఉండాలి. చిలికి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త
పడాలి. కొందరు 'మా దంపత్యజీవితంలో గోడవలు లేవు' అని గొప్పలు చెబుతూ
ఉంటారు. ఇది పచ్చి అబద్దం. ఎందుకంటే భార్యాభార్తలన్నాక ఏదోక విషయంలో
ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అసలు కలహాలు లేని
దాంపత్యం ... దాంపత్యమే కాదు. సంసారంలో అలకలు, బ్రతిమాడుకోవడాలు ఉంటేనే,
దాంపత్యానికి నిండుదనం వస్తుంది. ఆలుమగల బంధం జీవితకాలం కొనసాగాలంటే, వారి మధ్య వచ్చే కలహాలు హుందాగా ఉండాలి. అప్పుడప్పుడు వచ్చే ఘర్షణను
మాటలవరకే పరిమితం చేస్తే, దాంపత్య జీవితంలో చక్కని ఫలితాలను
పొందగలుగుతారు.
Friday, 1 July 2016
"అహంకారం"
అహంకారం, మొండితనం, మూర్ఖత్వం ఇవి తీవ్రమైన మనోరుగ్మతలు. మనిషిలో అహంభావం ఉన్నంతవరకు ఎవరినీ ప్రేమించలేరు. అహంవల్ల ఎదుటివారు తన కన్నా తక్కువవారిగా కనిపిస్తారు. స్వార్థబుద్ధి వెంటాడుటం వల్ల నీచమైన అలవాటు మనసులో చోటుచేసుకుంటుంది. అలా కాకుండా ఉండాలంటే, అహంకారపూరిత మాటలకు, చేతలకు దూరంగా ఉంటూ, మనసును మల్లెపువ్వులా మలచుకోవాలి. 'నేను' అనే అహంకారానికి, 'నాది' అనే మమకారానికి స్వస్తి పలకాలి.
Wednesday, 29 June 2016
పవిత్రమైన తులసి !
భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేకస్థానం ఉంది. హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా. అది ఎన్నోమొండి రోగాలను నయం చేస్తుంది. రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే వ్యాధుల దరిచేరవంటారు. మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు. ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.
Wednesday, 22 June 2016
Saturday, 18 June 2016
Subscribe to:
Posts (Atom)




