”శోధిని”

Wednesday, 2 September 2015

మంచి మనసుకు స్వాగతం !

నెమలి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.  కాని అది గొంతు విప్పితే కర్ణ కఠోరంగా ఉంటుంది.
ఏమాత్రం అందంలేని నల్లని కోకిల గొంతు ఎంతో శ్రావ్యంగా...మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.
మనిషి కుడా అంతే! చాలా తెల్లగా అందంగా ఉండవచ్చు.  కాని మనసు  నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆ అందం మంచు కడిగిన మల్లెపువ్వులా ఉంటుంది.  


Tuesday, 1 September 2015

టీవీ సీరియల్స్ బాధితుడు ! (జోక్ )

సంవత్సరాల తరబడి పాకంలా సాగుతున్న తెలుగు టీవీ సీరియల్స్ మాయలోపడి భర్తను, పిల్లలను పట్టించుకోని ఓ మహిళ   భర్త విసిగిపోయి ఓ స్వామీజీని కలిశాడు.
మహిళ  భర్త : " నాభార్యకి  టీవీ సీరియల్స్ పిచ్చి మాన్పించే ఉపాయం ఉంటే చెప్పండి స్వామీ " 
స్వామీజీ : " ఆ ఉపాయమే తెలిస్తే నేను ఈ సన్యాసిగా ఎందుకు మారతాను శిష్యా "
మహిళ  భర్త : " అంటే.. మీరు కూడా నాలాగే ..."
స్వామీజీ : అవును నాయన... నేను కుడా నీలాగే తెలుగు టీవీ సేరియల్స్ బాధితుడినే!



Monday, 31 August 2015

దేవతా విగ్రహాలు !


మన పురాణాలలో భగవంతుడికి ఎన్నో రూపాలు, పేర్లు చెప్పబడ్డాయి.  స్త్రీ, పురుష రూపాలలో వేరు వేరు పేర్లతో భగవంతుడిని ఆరాధించవచ్చని మన హిందూ సంప్రదాయం చెబుతుంది.  పురాణాలలో చెప్పబడ్డ రూపాలను విగ్రహాల రూపంలో మన ముందు ఉంచుకుని పూజించడం ద్వారా  ఆ విగ్రహాల మీద మనకు భక్తి విశ్వాసాలు ఎక్కువవుతాయి.  మన కళ్ళకు సాధారణంగా కనబడని దేవుడు విగ్రహాల రూపంలో మనకు దర్శనమిస్తూ మనల్ని సదా రక్షిస్తుంటారనే భావన మనలో కలుగుతుంది.  ఆ భావనే మనలో మంచి గుణాలను కలగడానికి సహాయం చేస్తుంది.  పెద్దలను గౌరవించడం, తోటివారికి సహాయం చేయడం, బాగా చదివి ప్రయోజకుడు కావడం వంటి మంచి సుగుణాలు... దైవభక్తి  వున్నవాళ్లలో కలుగుతాయి.  నిర్థిష్ట మార్గంలో నడుస్తూ, క్రమపద్దతిలో జీవనం సాగిస్తూ...దుర్మార్గులకు, దురాచాలకు దూరంగా ఉండమని, శాంతి, సహనంవంటి సత్త్వగుణాలను,  నైతిక విలువలను పెంచుకోవడానికి ఉపయోగపడతాయి.  ఇవన్నీ దైవాన్ని నమ్మడం ద్వారా  కలుగుతాయి.   

Thursday, 27 August 2015

తెలుగిళ్ళల్లో వరలక్ష్మి వైభవం !


మహాలక్ష్మికి అత్యంత ఇష్టమైనది శ్రావణమాసం...
మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించేది శ్రావణమాసం...
ప్రతి ఇంటా ఆధ్యాత్మిక సుమాల గుబాళింపు ...
సకల సౌభాగ్యాల పదాత...వరలక్ష్మి మాత 
సౌభాగ్యప్రదం...మంగళప్రదం 
ఎంతో శుభదాయకం.... వరలక్ష్మివ్రతం!


Sunday, 23 August 2015

గోమాతను పూజిద్దాం !


పవిత్రతకు, శుభానికి చిహ్నం గోవు.  సకల దేవతలు తన శరీరంలో కొలువై వున్న గోమాత, ప్రత్యక్ష దైవంగా హిందువులచేత పూజలందుకుంటోంది. మన సంప్రదాయంలో గోమాతను పూజించడం గొప్ప ఆచారం. గోమాతను  దర్శించినా, స్పర్శించినా  కోటి పుణ్యాలు లభిస్తాయని మన వేదాలు చెబుతున్నాయి. అందుకే గోమాతను  సకలదేవతా స్వరూపముగా భావించి పూజిస్తే, పుణ్యఫలం దక్కుతుందంటారు.