”శోధిని”

Sunday, 23 August 2015

గోమాతను పూజిద్దాం !


పవిత్రతకు, శుభానికి చిహ్నం గోవు.  సకల దేవతలు తన శరీరంలో కొలువై వున్న గోమాత, ప్రత్యక్ష దైవంగా హిందువులచేత పూజలందుకుంటోంది. మన సంప్రదాయంలో గోమాతను పూజించడం గొప్ప ఆచారం. గోమాతను  దర్శించినా, స్పర్శించినా  కోటి పుణ్యాలు లభిస్తాయని మన వేదాలు చెబుతున్నాయి. అందుకే గోమాతను  సకలదేవతా స్వరూపముగా భావించి పూజిస్తే, పుణ్యఫలం దక్కుతుందంటారు.


 

Saturday, 22 August 2015

" శ్రావణలక్ష్మి "


       మహిళామణులకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం.  ఈ  మాసంలో మంగళ, శుక్రవారాల్లో పసుపు, కుంకుమ, పువ్వులు, దీపంలో  లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శ్రావణమాసంలో ప్రతి రోజూ పవిత్రమేనదే. ముఖ్యంగా సోమవారాలు అభిషేక ప్రియుడయిన పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. అదేవిధంగా మంగళవారాలు గౌరీదేవిని, శుక్రవారాల్లో లక్ష్మీదేవిని భక్తిశ్రద్దలతో పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి.  వృద్ధిని, సంపదని, ఆయురారోగ్యాలను ప్రసాదించే  లక్ష్మీదేవిని పూజించి ఆతల్లి అనుగ్రహం పొందుదాం.

Thursday, 20 August 2015

మా పనిమనిషి ! (జోక్ )

"నువ్వెప్పుడూ సాహితీ సమావేశాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతావ్ ....  ఇంట్లో పని మనిషిని మాన్పించావ్....  ఇల్లు చూస్తే చాలా శుభ్రంగా ఉంటుంది.  ఇది ఎలా సాధ్యం ?" గాయత్రిని అడిగింది ఆశ్చర్యంగా తన స్నేహితురాలు.
"పని మనిషి లేదన్నాను కాని,  మా వారు లేరని చెప్పలేదుగా !" అంది  విలాసంగా కాళ్ళు ఊపుతూ 
"అంటే మీవారిచేత ఇంటి పని చేయిస్తున్నావా ?"
"చేయిస్తే తప్పేమిటి?  పది లక్షలు కట్నం ఇచ్చి కొన్నాను ...అందుకే ఇంటిపని, వంటపని, తోటపని చేయాలి తప్పదు."
"నా కళ్ళు తెరిపించావు ... వెంటనే మా పనిమషిని కూడా మాన్పించాలి" అంటూ హడావుడిగా ఇంటికి బయలు దేరింది గాయత్రి  స్నేహితురాలు.

 

Wednesday, 19 August 2015

అవినీతి జలగలు !

ప్రభుత్వ ఉద్యోగాలు 
పని తక్కువ 
పరిహారం ఎక్కువ 
లక్షల్లో జీతాలు 
అయినా లంచాలు 
ప్రతి ఆఫీసుల్లోనూ
అవినీతి జలగలే !
ప్రభుత్వాలు మారినా
మారని చేతివాటాలు !!

 

Tuesday, 18 August 2015

ఇది మా ఆచారం ! ( జోక్ )

ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ జరుగుతోంది.  బయట బందువులందరూ భాధను దిగమింగుతూ... ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుంటున్నారు.  ఇంతలో నర్స్ పెద్ద పూలదండతో ఆపరేషన్ థియేటర్ లో వెళుతుంటే, పేషెంట్ బంధువులకు అనుమానం వచ్చి...                             "పూలదండ ఎందుకండీ " ఆతృతగా అడిగారు.
"డాక్టర్ గారు తొలిసారిగా ఆపరేషన్ చేస్తున్నాడు.   విజయవంతమైతే డాక్టర్ గారికి వేసి అభినందనలు చెబుతాం.  ఫెయిలయితే పేషెంట్ మెడలో వేసి సానుభూతి వ్యక్తపరుస్తాం.  ఇది మా ఆసుపత్రి ఆచారం."