”శోధిని”

Saturday, 11 July 2015

దేవాలయం ...శోభాయమానం !

దేవాలయం అతి పవిత్రమైనది.  ఆ పవిత్ర స్థలంలో చెట్టు, పుట్ట, నిప్పు, నీరు, గాలి  అన్నీ అత్యంత పవిత్రమైనవే!  అక్కడ ఉన్నంత సేపు మనసు ప్రశాంతతను పొందుతుంది.  బాహ్యప్రపంచాన్ని వీడి, ఆధ్యాత్మిక లోకంలోకి ప్రవేశించి మధురమైన అనుభూతిని పొందుతాం.  అక్కడ పవిత్రమైన ఆలోచనలతో ఉంటే,  మనలో ఉండే అన్ని రుగ్మతలు తొలగిపోతాయి.

Tuesday, 30 June 2015

తులసి


భారతీయ సంస్కృతిలో  తులసికి ప్రత్యేకస్థానం ఉంది.  హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు.  అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా.  అది ఎన్నోమొండి  రోగాలను నయం చేస్తుంది.  రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే  వ్యాధుల దరిచేరవంటారు.  మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు.  ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.

Sunday, 28 June 2015

మన భద్రత మన చేతుల్లోనే ...


ఓ కుటుంబ యజమాని  కుటుంబ సభ్యులతో మోటారు బైక్ మీద ఎలాంటి రక్షణ లేకుండా వెళ్ళడం చూస్తున్నాం. ఇది ఎంత ప్రమాదమో ఆ యజమాని ఆలోచించడం లేదు.  పిల్లలకు జాగ్రత్తలు చెప్పాల్సిన వాళ్ళే ఇంత రిస్క్ తీసుకొని ప్రయాణం చేయడం, ప్రమాదంతో పరాచకాలు ఆడటమే అవుతుంది.



Saturday, 27 June 2015

విమాన వెంకటేశ్వర స్వామి

తిరుమలలో శ్రీవారిని దర్శించి బయటకు వచ్చేటప్పుడు ఉత్తర దిశలో "విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించండి" అని బాణం గుర్తు చూపుతూ బోర్డు ఉంటుంది.  విమాన వెంకటేశ్వర స్వామికి వెండి మకర తోరణాన్నిఏర్పాటుచేయడాన్నిగమనించవచ్చు.  విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే,  మూలవిరాటైన శ్రీవారిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.  సరిగా స్వామివారి దర్శనం కలగనప్పుడు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించవచ్చు.