Sunday, 31 May 2015
Saturday, 30 May 2015
మానవసేవే మాధవసేవ !
శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేపట్టిన గొప్ప సేవ అన్నదానం కార్యక్రమం. నిత్యం ముప్పయివేల మందికి పైగా భక్తులు అన్నదానం కాంప్లెక్స్ లో భోజనం చేసి స్వామివారి మహాప్రసాదం తిన్నంత ఆనందపడిపోతారు. పేద భక్తులకు ఈ సదుపాయం నిజంగా ఒక వరమే ! రోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఇక్కడ ఉచిత భోజనాలు పెడుతూనే ఉంటారు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అయన చేతుల మీదుగా ప్రారంభమైన గొప్ప పుణ్య సేవా కార్యక్రమం అన్నదానం.
Wednesday, 27 May 2015
యుగపురుషుడు !



కృషి, పట్టుదల, క్రమశిక్షణ, మంచి నడవడికతో... అంకితభావంతో తెలుగు చలనచిత్ర రంగంలో మహోన్నత స్థాయికి చేరుకొని తెలుగు ప్రజల మన్నలను పొందిన గొప్ప నటుడు స్వర్గీయ నటరత్న నందమూరి తారక రామారావు గారు. మాటలో మంచితనం, భావనలో వివేకం, సాధనలో పట్టుదల, నటనలో విలీనం రామారావు గారికున్న ముఖ్య లక్షణాలు. సంపూర్ణమైన వ్యకిత్వానికి ఆయన చక్కని నిదర్శనం. 
తెలుగు చలన చిత్రరంగంలో ఎన్నెన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి, తనకు సాటిరారని నిరూపించిన ఎన్టీఆర్ సినీ అభిమానుల హృదయాలలో శ్వత స్థానం
సంపాదించుకున్నారు...తెలుగు సినీరంగంలో అగ్రస్థానం అధిష్టించారు. ఏ పాత్ర పోషించనా ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. చారిత్రాత్మకం, జానపదం,
పౌరాణికం, సాంఘీకం ఇలా ఆయని చేయని పాత్రంటూ లేవు. ప్రతి పాత్రలో లీనమై తెలుగువారి హృదయాలలో జీవించి ఉన్నారు . తెలుగువాడి బింకం, తెలుగువారి మమకారం, తెలుగువాడి మాటతీరు, పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన సమున్నతుడు... వ్యక్తిత్వంలో మహోన్నతుడు.
ఇక రాజకీయాల విషయానికొస్తే ...అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో కంచుకోటగా ఉంటూ తనకు తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించన ఘనత ఎన్టీఅర్ గారిది.ఆయన ముఖ్యమంత్రిగా ఒన్న సమయంలోపార్లమెంటులో పెద్ద పార్టీలయిన బిజెపి, సిపిఐ, సిపియంల కంటే ఎక్కువ స్థానాలు 35 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని పార్లమెంటులో ఒక ప్రాంతీయ పార్టీ మొదటి సారిగా ప్రదాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువారందరికీ గర్వకారణం.ఎన్టీఅర్ జన్మదిన సందర్భంగా ....
Monday, 25 May 2015
ఇది స్వార్థం కాదా ?
అమ్మాయిలు నలుపు అయినా మంచి మనసు ఉంటే చాలు. తెల్లటి అమ్మాయిలలో మంచి మనసు లేకపొతే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుంది. అందుకే అబ్బాయిలూ...కాబోయే భార్య రంగు ఏదైనా వెన్నలాంటి మంచి మనసును చూడండి. కేవలం రంగు చూసి మోసపోకండి. మీరు నలుపు అయినా తెల్లటి అమ్మాయి భార్య కావాలనుకోవడం స్వార్థం కాదా ? మీలాగే అమ్మాయిలు కూడా తెల్లటి అబ్బాయిలనే తన జీవిత భాగస్వామిగా కావాలనుకుంటే చాలా మంది అబ్బాయిలు పెళ్ళికాని ప్రసాదులుగా మిగిలిపోతారు. కాని, అమ్మాయిలు అలా రంగు గురించి ఆలోచించడం లేదు. హృదయం నిండా మంచితనం, మానవత్వం నింపుకుని అబ్బాయిల రంగు ఎదైనా తల వంచి తాళి కట్టించు కుంటున్నారు... అదీ వాళ్ళ గొప్పతనం!
Saturday, 23 May 2015
Friday, 22 May 2015
Thursday, 21 May 2015
Subscribe to:
Posts (Atom)





