Thursday, 31 July 2014
Monday, 28 July 2014
పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!
శుభాలు కురిపించే వారాల మాసం రంజాన్. ఈ పవిత్ర మాసం అత్యంత శుభప్రదమైనది. ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ముస్లిం సోదర సోదరీమణులలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి జీవనసాఫల్యానికి కావాల్సిన అనేక విషయాలు ఈ మాసంతో ముడిపడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో ఈ పవిత్ర గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే ఈ మాసమంతా ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రం, పుణ్యదాయకం. శుభాల సిరులు అందించే రంజాన్ పర్వదినం అందరికీ సకల శుభాలను, శోభలను అందించాలని మనసారా కోరుకుంటున్నాను.
మిత్రులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు!
Sunday, 27 July 2014
Saturday, 26 July 2014
నేటి మానవుడు !
నిర్దాక్షణంగా చెట్లను నరికేస్తూ ...
వ్యర్ధాలను నలువైపులా వెదజల్లుతూ ...
భూగర్భ జలాలను పిండేస్తూ...
సహజవనరులను హరించేస్తూ...
జంతువులను, పక్షులను నాశనం చేస్తూ...
జంతువులను, పక్షులను నాశనం చేస్తూ...
ప్రకృతి వినాశనానికి
కారణమవుతున్నాడు విజ్ఞానవంతుడయిన నేటి మానవుడు !
Thursday, 24 July 2014
పాపం ... పసివాళ్లు!
గుండెలు పిండేసే విషాదం. హృదయాలను ద్రవింపచేసే ఘోర ప్రమాదం. పాపపుణ్యమెరుగని పసివాళ్ల ప్రాణాలను మృత్యుశకటం చిదిమేసిన ఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదువుల కోసం బ్యాగులు భుజాన వేసుకుని బస్సు ఎక్కిన చిన్నారులు కానరానిలోకాలకు వెళ్లిపోయారు. వెళ్లొస్తామంటూ ఉత్సాహంగా వెళ్లిన తమ బంగారు కొండలను రైలు రాక్షసుడు కానరాని లోకాలకు ఎత్తుకుపోయాడని తెలియగానే తల్లడిల్లుతున్న తల్లిదండ్రుల శోకాగ్నికి చల్లార్చడం ఎవరి తరం?
ధూమపానం ... ప్రాణాంతకం !
బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధిస్తూ ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా... దీని పైన అధికారులు దృష్టి సారించక పోవడంతో పొగబాబులు, తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాక పక్క నున్న వారి ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నారు. నిబంధనలు కాగితాలకే పరిమితం చేయకుండా వాటిని అమలు చేస్తూ, బహిరంగ ప్రదేశాలలో పొగత్రాగే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధించాలి. సిగరేట్టులో నికోటిన్ అనే పదార్ధం ఉండటం వలన క్యాన్సర్, శ్వాశాకోస వ్యాధులు, బి. పి, హార్ట్ ఎటాక్ వంటివి వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నా కుర్రకారు మాత్రం గుప్పు గుప్పు మంటూ పొగను ఉదేస్తూ వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. బతుకంతా పొగవలయమైతే చివరికి మిగిలేది అస్థిపంజరమేనని పొగబాబులు గుర్తుంచుకోవాలి.
Sunday, 20 July 2014
మనసారా నవ్వు !
మనిషికి 'నవ్వు' అద్భుతమైన టానిక్. నవ్వటం వల్ల శరీరానికి, మనసుకు ఎంతో మేలు కలుగుతుంది. శరీరంలో పేరుకు పోయిన మలినాలన్నిటినీ తొలగించ గలుగుతుంది. హాయిగా నవ్వగలిగిన వారి ముఖంలో ప్రశాంతత వస్తుంది.... ముఖం కళగా తయారవుతుంది. నవ్వు రోగ నిరోధకవ్యవస్థను మెరుగు పరుస్తుంది. తద్వారా ఆరోగ్యం బాగుంటుంది. నవ్వుకు దూరమవ్వడమంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. అందుకే నిత్యం 'సిరిమల్లె పువ్వల్లె నవ్వు' (పేస్ బుక్) లోని కార్టూన్లు చూడటం, జోక్స్ చదవటం, కామెడీ సినిమాలను తిలకించడం అలవాటు చేసుకుంటే జీవితం నందనవనం అవుతుంది.
Subscribe to:
Posts (Atom)




