మండుటెండల నుండి సేదతీర్చే మల్లెల్ని మించిన మనోహర పరిమళం మరెక్కడా ఉండదు. వీటిలో సుగంధ పరిమళం ఎక్కువ. వీటి సువాసన దంపతుల మధ్య ఇష్టాన్ని, మమకారాన్ని, ప్రేమానురాగాల్ని పెంచుతుంది. మల్లెల గుబాళింపు ఆహ్లాదంగా, ఎంతో కమ్మగా ఉంటుంది. గుండెల నిండా సంతోషాన్ని నింపి ఆనందాల్లో ముంచెత్తుతాయి. అసలు మల్లెల్ని చూస్తేనే మనసు పులకిస్తుంది. మైమరచి మయూరంలా నాట్యం చేస్తుంది. మల్లెపూల సువాసనకు విసుగు, అసహనాలు మన దరికి చేరవు. మహిళలు మల్లెలు ధరించడం వల్ల సుఖంగా, ఆనందంగా, హాయిగా నిద్ర పడుతుంది. పక్కవాళ్ళకి కూడా ఇలాంటి అనుభూతి కలుగుతుంది. అంతేకాదండోయ్... ఈ మల్లెల పరిమళం చుట్టూ పరిసరాలను పరచుకొని హాయిని కలిగిస్తాయి. కళ్ళ నుంచి మెదడు వరకూ ఆహ్లాదం కలిగించడంలో ఇవి చురుగ్గా పనిచేస్తాయి.
Tuesday, 13 May 2014
Saturday, 10 May 2014
'అ' అంటే... అనురాగం !
'అ' అంటే అనురాగం
'మ్మ' అంటే మమకారం
వెరసి అమ్మంటే ...
ప్రేమానురాగాల అమృత పాత్ర !
అందుకే...!
అమ్మ భగవంతుని ప్రతిరూపం ...
అమ్మ పిలుపు ఎంతో మధురాతి మధురం!
అమ్మ పదంలో కమ్మదనం ...
అమ్మ మనసు ఎంతో మెత్తదనం !
జీవితాన్ని ఇచ్చే మాతృమూర్తి...
ప్రేమను పంచే ప్రేమ మూర్తి...
తన బిడ్డల ఉన్నతికోసం ...
నిరంతరం శ్రమించే త్యాగమూర్తి !
మిత్రులందరికీ మాతృమూర్తి దినోత్సవ శుభాకాంక్షలు!
Wednesday, 7 May 2014
Thursday, 24 April 2014
ఓటు ప్రతిజ్ఞ చేద్దా!
నేను ఓటరుగా నమోదు అయినందుకు గర్విస్తున్నాను. నేను నాయొక్క ఓటు హక్కును వినియోగించుకుంటానని, అర్హులైన ప్రతి ఓటరు చేత తప్పనిసరిగా ఓటు వేయిస్తానని, అదేవిధంగా ఓటు హక్కు వినియోగించు సందర్భంలో ధన, కుల, మద్యం, కానుకలు మరియు బంధుప్రీతిలాంటి వాటికి లొంగనని , అదేవిధంగా ఇతర అర్హులైన ఓటర్లను కుడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా చూస్తానని, చిత్తశుద్ధితో, నిబద్ధతతో ప్రతి ఒక్క పౌరునితోఓటు వేయించి నా సామాజిక బాధ్యతను నెరవేరుస్తానని ప్రమాణం చేస్తున్నాను.
Tuesday, 22 April 2014
ఆలోచించండి ... ఓటు వేయండి !
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఓటును హక్కుగానే కాకుండా మన ధర్మంగా భావించాలి. మనం ఓటు వేసేటప్పుడు మన ప్రాంతం వాడనో, మన కులం వాడనో, మన మతం వాడనో చూడకుండా అభ్యర్థి సామర్థ్యం చూసుకుని ఓటువేయడం మరచిపోవద్దు. ఓటు అనేది మనకు లభించిన గొప్ప ఆయుధం. అముల్యమైన ఓటును సక్రమంగా వినియోగించుకోవడం మన భాద్యత. బలమైన, నీతిపరమైన , నాణ్యమైన ప్రభుత్వం కోసం ఓటు వేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థవంతులైన నాయకులను ఎన్నుకోవడం మన కర్తవ్యం. కలిసిమెలిసి వున్న ప్రజలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టే నాయకుల పట్ల అప్రమత్తతగా ఉండాలి. పార్టీలకతీతంగా ప్రజల బాధలను, అవసరాలు తెలిసిన వారినే ఎంపిక చేసుకొవాలి. పోటి చేసే వారిలో అందరూ మంచివాళ్ళు లేకపోయినా, ఉన్నవారిలో కాస్త మంచివారిని ఎంపిక చేసుకోవడం మరవద్దు.
Friday, 18 April 2014
Thursday, 17 April 2014
నేడు శుభ శుక్రవారం !
క్రైస్తవ సోదరీ సోదరులకు ముఖ్యమైన దినాలలో ప్రధానమైనది 'గుడ్ ఫ్రైడే' ఒకటి. ఏసు క్రీస్తును శిలువ చేసిన రోజు... ఈ రోజే కాబట్టి ఆయన్ని నిష్టతో పూజిస్తే... పుణ్య ఫలాలు అనుగ్రహిస్తాడని భక్తుల విశ్వాసం. ఏంతో పవిత్రమైన, శుభకరమైన ఈ శుక్రవారం నాడు ఉపవాస దీక్షలు, ప్రార్థనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఏసుక్రీస్తు శిలువలో మానవాళి కోసం మరణించడాన్ని గుర్తుచేసుకునే రోజు 'గుడ్ ఫ్రైడే'. ఆయన మరణించిన మూడో రోజు ఆదివారం నాడు క్రీస్తు తిరిగి జన్మించాడని క్రైస్తవ సోదర సోదరీమణులు ఈస్టరు పర్వదినాన్ని సంతోషంతో ఘనంగా జరుపుకుంటారు.
మత గ్రంధాలన్నీ మంచినే బోధిస్తాయి. అందుకే అన్ని మత గ్రంధాలను చదువుదాం... మంచిని గ్రహిస్తాం... మనిషిగా సాటి మనిషిని ప్రేమిద్దాం!
Subscribe to:
Posts (Atom)







