”శోధిని”

Thursday, 8 August 2013

'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!


ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్రమైన 'రంజాన్' పండుగ అత్యంత ప్రధానమైనది.  రంజాన్ మాసం ప్రారంభం రోజు నుంచి వేకువజామునే లేచి, సూర్యోదయానికి ముందే అన్నపానీయాలను పూర్తి  చేస్తారు.  అప్పటినుంచి నెల రోజులు  సూర్యాస్తమయం వరకు  దైవారాధన, పవిత్ర ఉపవాసాలు ఆచరిస్తారు. ఎంతో  దీక్షగా ఖురాన్ పారాయణ చెస్తారు.  అమావాస్య తర్వాత కనిపించే నెలవంకను చూసిన పిమ్మట రంజాన్ ఉపవాసాలు ముగించి  ఆనందం విరిసిన హృదయంతో రంజాన్ పండుగను జరుపుకుంటారు. ఇప్తార్ విందుకు ఇతరులను ఆహ్వానించి సమైఖ్యతను చాటుతారు.  ఈ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికి  'రంజాన్' పర్వదిన శుభాకాంక్షలు!


Sunday, 4 August 2013

స్నేహబంధం ... ఎంతో మధురం!


బ్లాగ్ మిత్రులందరికీ మైత్రి దినోత్సవ శుభాకాంక్షలు!

Saturday, 3 August 2013

ఈనాడు (04-08-13) హైదరాబాద్ ఎడిషన్ లో




హాయిగా నవ్వండి... ఆరోగ్యంగా వుండండి!

        మానవులకు దేవుడిచ్చిన అపురూపమైన గొప్ప వరం ‘నవ్వు’.  ఈ భాగ్యం మానవాళికి మాత్రమే దక్కింది.  హాయిగా నవ్వడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి.  మనసారా నవ్వితే ఆయువు పెరుగుతుంది.  శారీరక ఆరోగ్యం చేకూరుతుంది.  చలాకీగా ఉండటంతో ఒత్తుళ్ళు దరి చేరవు.  ప్రతి రోజు కనీసం 20 నిమిషాలు నవ్వితే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా వుంచుతుంది.  అంతేకాదు శత్రువులను కుడా మిత్రులుగా మార్చే గుణం ఈ నవ్వుకి వుంది.  అవకాశం వచ్చినప్పుడల్లా హాయిగా నవ్వి చూడండి... మీకు తెలియకుండానే అధిక రక్తపోటు అదుపు లేకి వస్తుంది.  ఒత్తిడి హార్మోన్లు తగ్గుతాయి.  గుండె జబ్బులు దూరం అవుతాయి.    మనుషల మధ్య  నవ్వులు విరబూసి ఆనందాన్ని పంచుకుంటే బంధాలు బలపడతాయి. ఇన్ని ప్రయోజనాలున్న నవ్వు కన్నీళ్ళను కడిగేసే కల్మశం లేని పువ్వు లాంటిది అందుకే హాయిగా నవ్వండి. 


Monday, 29 July 2013

మన తెలుగు సినిమాలు

మన తెలుగు సినిమాలు రోజు రోజుకు మరీ దారుణంగా తయారవుతున్నాయి.  కథలో దమ్ము లేక పోయినా, బూతు మాటలనే నమ్ముకుని సినిమాలు తీస్తున్నారు.  ఈ మధ్య వస్తున్న తెలుగు చిత్రాల నిండా బూతు డైలాగులే  వినిపిస్తున్నాయి.  టీనేజ్  కుర్రాళ్ళను థియేటర్ కి రప్పించడానికి  బూతు డైలాగులను ఎరగా వాడుతున్నారు. ఒక సినిమాలో అయితే చివరికి ముత్ర విసర్జన సన్నివేశాలకు కూడా   చెత్త  డైలాగులను వాడి తెలుగు సినీ పరిశ్రమను భ్రష్టు పట్టించారు.  ఈ చెత్త మాటలు రాసే రచయితలు  కాస్త సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని రాస్తే బాగుంటుంది.  సినీ రచయితలు రాసే  డైలాగులు 'నీ యంకమ్మ' తో మొదలై, 'దొబ్బింది' అనే బూతు డైలాగ్ తో తారా స్థాయికి వెళ్ళాయి. ఈ అశ్లీల, బూతు  డైలాగులు నేటి యువతీ యువకుల నోట 'ఊతపదాలు' గా మారడం మన దౌర్భాగ్యం.    


Friday, 26 July 2013

ఈ కేరళ కుట్టి మహా గట్టి!


నటనకు ప్రాధాన్యత ఇచ్చే నిత్యా మీనన్ 'గుండె జారి గల్లంతయ్యిందే' సూపర్ హిట్ కావడంతో ఆమె డిమాండ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.  ఆమెతో చిత్రాలు నిర్మించేందుకు నిర్మాతలు పోటి పడుతున్నారు.  అయితే వచ్చిన అవకాశాలను ఒప్పుకోకుండా కేవలం నటనకే ప్రాధాన్యత వున్న పాత్రలనే ఎన్నుకుంటోంది.  తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతూ వరుస హిట్లు సాధిస్తోంది.  తొలి చిత్రం నుంచి కథల ఎంపికలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ, తన డబ్బింగ్ ను తనే చెప్పుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.  'అలా మొదలైంది', 'ఇష్క్', 'గుండె జారి గల్లంతయిందే'  చిత్రాలలో తెలుగు ప్రేక్షకుల మతి పోగొట్టిన ఈ కేరళ కుట్టి మహా గట్టిది.  ఎందుకంటే ఈ మధ్యనే పైలెట్లను ఎలా మాయచేసిందో తెలియదు కాని  బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే విమానంలో  పైలెట్లు వుండే కాక్ పిట్ లో కూర్చుని ప్రయాణం చేసిందట.  ఆమె సరదా తీరింది కాని ఆమెను కాక్ పిట్ లోకి అనుమతించిన పైలెట్లు ఇద్దరు సస్పెన్స్ కు గురయ్యారు పాపం.  
 

Thursday, 25 July 2013

ప్రియా...ప్రియా!

ఉషోదయ కిరణాలకి
మంచు తెర కరిగినట్టు...
తొలకరి జల్లుకి
పుడమి పులకించినట్టు...
హోరు గాలికి
చిగురాకు వనికినట్టు...
పున్నమి వెన్నెలకి
కలువ వికసించినట్టు...
నిన్ను చూడగానే
మరువలేని మరుపురాని
మధుర జ్ఞాపకాలు
నన్ను చుట్టిముట్టాయి
నీ మనోహర రూపం
నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది
ప్రియా నిత్యం...
నీ ఉహల్లో గడిపేస్తున్నా 
నీ ఆలోచనల్లో జీవిస్తున్నా!