తెలుగులో గొప్ప చిత్రం ఏదని ఎవరినైనా అడిగితే వెంటనే చెప్పేది 'మాయా బజార్' అని. అలాగే తెలుగులో గొప్ప నటి ఎవరని అడిగితే 'మహా నటి సావిత్రి' అని ఎవరైనా చెబుతారు. తెలుగు ప్రేక్షకుల మనుసులను, హృదయాలను తన నటనతో ఆకట్టుకున్న ఎకైక నటి సావిత్రి. ఆప్యాయతతో కూడిన ఆహ్లాదమైన చిరునవ్వు ఆమె సొంతం. వాత్సల్యంతో నిండిన అనురాగ పూర్వకమైన కల్మషం లేని పలకరింపు ఆమె సహజ గుణం, ఆర్థ్రత , ఆప్యాయత కురిపించే పాత్రలను ఆమె నల్లేరు మీద బండిలా పోషించి మెప్పించారు. కేవలం ముఖ కవళికల ఆధారంగా ప్రేక్షకులను మంత్రం ముగ్దుల్ని చేయడం ఆమె సొత్తు. కంటి చూపుతో కోటి భావాలను పలికించే సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె నటించిన చిత్రాలన్నీ అసలు సిసలైన మేలిమి రత్నాలు.
Monday, 8 July 2013
అమ్మాయిలూ... జాగ్రత్త!
నేడు అమ్మాయిలు అన్ని రంగాలలో మంచి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. అబ్బాయిలతో సమానంగా రాణిస్తున్నారు. ఇది శుభ పరిణామం. కాని, ప్రేమ దగ్గరకొచ్చేసరికి పప్పులో కాలేస్తున్నారు. చచ్చు పుచ్చు కబుర్లు చెప్పే అబ్బాయిల చేతుల్లో చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నారు. మగాడి ఆలోచనా విధానం వేరని గ్రహించలేక పోతున్నారు. ప్రేమ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోంది. అమాయకంగా ప్రేమంటూ అబ్బాయిల చేతిలో బలవుతున్నారు. ఇలా మోసపోయే అమ్మాయిలు వున్నత వరకూ మోసం చేసే అబ్బాయిలు పుడుతూనే ఉంటారు.అమ్మాయిలూ భ్రమలోంచి బయట పడండి... బాగా ఆలోచించి చక్కని భవిష్యత్తును నిర్మించుకోండి. మోసగాళ్ళ మాయమాటలు విని మోసపోకండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుందని మరచిపోకండి. మీ తెలివితేటలు ఉపయోగించి మంచి తోడును ఎన్నుకోండి.
Saturday, 6 July 2013
Friday, 5 July 2013
జాంపండ్లు!
ఖరీదు తక్కువని జామకాయను చిన్న చూపు చూడకండి. దీనిలో అధిక పోషకాలు, ఎన్నో లాభాలు ఉన్నాయి. షుగర్ పేషెంట్లకు జామ కాయ సంజీవనిలా పనిచేస్తుంది. దీనిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి మంచి మందుగా పనిచేస్తుంది. అంతేకాదండోయ్ రక్త పోటును అదుపులో వుంచడంతో పాటు రక్తం చిక్కపడకుండా ఉండటానికి సహాయపడుతుంది. ఎసిడిటి తగ్గిస్తుంది, మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఖరీదయిన పండ్ల కంటే ఎన్నో అధిక లాభాలు ఉన్నాయి. అందుకే జామ కాయ తినండి ... ఆరోగ్యంగా ఉండండి.
Wednesday, 3 July 2013
ప్రకృతి ఆగ్రహిస్తే ?
జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన జల ప్రళయం ఎవరూ ఉహించని ఉపద్రవం. పవిత్ర క్షేత్రాలు మరు భూమిగా మారి భయానక వాతావారంలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాల్సివచ్చింది. ఉహించని రీతిలో ప్రళయ గంగ భీకర రూపం దాల్చడంతో పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించులోవాలని తపన పడిన వారికి తీరని విషాదం మిగిలింది .కనీ వినీ ఎరుగని రీతిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. చిన్న రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ ని కోలుకోని దెబ్బ తీసింది . పుణ్యానికి పొతే పాపం ఎదురయినట్టు తనవారిని పోగొట్టుకుని బరువైన గుండెతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భగవంతుని ప్రతిరూపాలయిన వీర జవానుల సహాయంతో బయటపడ్డారు. ఈ పెను విపత్తుకు కారణంపర్యావరణం దెబ్బ తినడమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మన పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని నొక్కి చెప్పారు. అభివృద్ధి పేరిట పచ్చని ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల మానవ మనుగడ పశ్నర్థకంగా మారే పరిస్తితి ఉంది. ప్రకృతి ఆగ్రహిస్తే ఏమవుతుందో మనం కల్లారా చూసాము. ఇప్పటికైన మన పాలకులు మేల్కొని పర్యావరణాన్ని పరి రక్షించడానికి తగు చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను నరికివేత ఆపాలి. నదులను స్వేచ్చగా పారనివ్వాలి. కొండలను నాశనం చేయకుండా కొండలుగానే ఉంచాలి.
Monday, 1 July 2013
Saturday, 29 June 2013
Subscribe to:
Posts (Atom)





