జూన్ నెలలో ఉత్తరాఖండ్ లో జరిగిన జల ప్రళయం ఎవరూ ఉహించని ఉపద్రవం. పవిత్ర క్షేత్రాలు మరు భూమిగా మారి భయానక వాతావారంలో భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చవి చూడాల్సివచ్చింది. ఉహించని రీతిలో ప్రళయ గంగ భీకర రూపం దాల్చడంతో పవిత్ర పుణ్యక్షేత్రాలు దర్శించులోవాలని తపన పడిన వారికి తీరని విషాదం మిగిలింది .కనీ వినీ ఎరుగని రీతిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించింది. చిన్న రాష్ట్రం అయిన ఉత్తరాఖండ్ ని కోలుకోని దెబ్బ తీసింది . పుణ్యానికి పొతే పాపం ఎదురయినట్టు తనవారిని పోగొట్టుకుని బరువైన గుండెతో ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని భగవంతుని ప్రతిరూపాలయిన వీర జవానుల సహాయంతో బయటపడ్డారు. ఈ పెను విపత్తుకు కారణంపర్యావరణం దెబ్బ తినడమేనని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. మన పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని నొక్కి చెప్పారు. అభివృద్ధి పేరిట పచ్చని ప్రకృతిని సర్వ నాశనం చేస్తున్నారు. పర్యావరణాన్ని నాశనం చేయడం వల్ల మానవ మనుగడ పశ్నర్థకంగా మారే పరిస్తితి ఉంది. ప్రకృతి ఆగ్రహిస్తే ఏమవుతుందో మనం కల్లారా చూసాము. ఇప్పటికైన మన పాలకులు మేల్కొని పర్యావరణాన్ని పరి రక్షించడానికి తగు చర్యలు చేపట్టాలి. పర్యావరణాన్ని కాపాడాలంటే చెట్లను నరికివేత ఆపాలి. నదులను స్వేచ్చగా పారనివ్వాలి. కొండలను నాశనం చేయకుండా కొండలుగానే ఉంచాలి.
No comments:
Post a Comment