పుష్యమాసం శుద్ద ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ముక్కోటి దేవతలకు వైకుంఠంలో దర్శనమిస్తాడని చెబుతారు. ఈ సందర్భంగా వైకుంఠంలో విష్ణువుకి ఇస్టమైన ఏకాదశి ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాలలో ఉత్తర దివ్యదర్శనం ఏర్పాటుచేస్తారు. వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న భక్తజనం శ్రీవారి ఉత్తర దివ్యదర్శనంతో పులకించి భక్తి పారవశ్యంలో మినిగి పోతారు.
1 comment:
నాకు తెలీక అడుగుతాను. వైకుంఠ ఏకాదశి ఒక పండగ కాదు. దానిని ఎవరూ ఒక సంబరంలా జరుపుకోరు. దానికి శుభాకాంక్షలు చెప్పడం సముచితమేనా? విజ్ఞులెవరైనా వివరించగలరు.
Post a Comment