శుభాలు కురిపించే వరాల మాసం రంజాన్.
ఈ పవిత్ర మాసం అత్యంత శుభప్రదమైనది.
ఎనలేని శుభాలను అందించే ఈ నెలంతా ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది మాసంలోనే పవిత్ర ఖురాన్ గ్రంధం అవతరించడంతో పవిత్ర
గ్రంధం సమస్త మానవాళికి మార్గదర్శిని అయ్యింది. అందుకే రంజాన్ మాసమంతా పవిత్రం, పుణ్యదాయకం. రంజాన్ పేరు వినగానే హృదయంలో భక్తిభావం
ఉప్పొంగుతుంది. సమస్త శుభాలతో ఆధ్యాత్మిక సౌరభాలు గుబాళిస్తాయి . మాసంలో చివరి రోజున ఉపవాసాలు ముగించి ఆనందం
విరిసిన హృదయంతో రంజాన్ పండుగను అత్యంత వైభవంగా, ఆనందోత్సాహాలతో శోభాయమానంగా జరుపుకోవడం ఆనవాయితి.
రంజాన్ పర్వదిన శుభసందర్భంగా...మిత్రులందరికీ
హృదయపూర్వక శుభాకాంక్షలు !
No comments:
Post a Comment