తెలుగువాడి బింకం, తెలుగువారి
మమకారం, తెలుగువాడి మాటతీరు, తెలుగువారి పద్దతి అంతా ఆయన దివ్యమైన రూపంలో కనిపిస్తుంది.
వ్యక్తిగా ఆయన సమున్నతుడు...
వ్యక్తిత్వంలో మహోన్నతుడు. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన
చిత్రరంగాన్ని ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు
సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు. ఓటును నోటుతో కొనకుండా ప్రజల అభిమానంతో నిజాయితీగా గెలిచిన మొదటి నాయకుడు ఎన్టీఆర్. మరపురాని మరువలేని మహా నటుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా....
Monday, 27 May 2019
Sunday, 26 May 2019
తులసితో ఆరోగ్యం
తులసి ఆకులను వేడినీళ్లలో వేసి మరిగించి కొద్దిగా తేనెను కలిపి తాగడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది.
రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నాలుగు తులసి ఆకులను వేసి ఉదయం పడగడుపున తాగితే, కడుపులోని క్రిములు నశిస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
Thursday, 23 May 2019
Sunday, 19 May 2019
Monday, 13 May 2019
Saturday, 4 May 2019
హాయిగా నవ్వుదాం....
మాటకన్న ముందుగా మందహాసంతో పలకరించడం మనిషి వ్యక్తిత్వానికి వన్నె తెస్తుంది. కంటి నిండా నిద్ర, కడుపునిండా మంచి భోజనంతోపాటు మనసారా నవ్వగలిగితే ఏ వ్యాధులు మన దరిచేరవు. ఆరోగ్యానికి నవ్వే దివ్యౌషధం. అందుకే ప్రతి రోజూ కనీసం 20 నిముషాలపాటు నవ్వగలిగితే మనలో వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. మానసిక ఆందోళనను మటుమాయం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచ్గుతుంది.
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా...
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా...
Subscribe to:
Posts (Atom)