Wednesday, 20 March 2019
Friday, 15 March 2019
జలదుర్గ
హైదరాబాద్, ఎస్.ఆర్ నగర్ సమీపంలోని బల్కంపేట ఓ బావిలో వెలసిన ఎల్లమ్మ అమ్మవారు భక్తులకు సర్వశుభాలను ప్రసాదిస్తున్నారు. అమ్మవారి శిరస్సు భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఆ పవిత్రజలాన్నే భక్తులు తీర్థంగా స్వకరిస్తూ ఉంటారు. జలదుర్గగా పూజలందుకుంటున్న అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మగానూ, రేణుకా ఎల్లమ్మగాను పిలుస్తుంటారు. ఎల్లమ్మకు ప్రీతిపాత్రమైన ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు అధికసంఖ్యలో ఈ క్షేత్రాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితి.
Wednesday, 13 March 2019
Sunday, 10 March 2019
Sunday, 3 March 2019
పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి.
అఖిల భక్తకోటికి పరమ పవిత్రమైన రోజు ...మహాశివరాత్రి. పగలంతా ఉపవాసం, రాత్రంతా జాగారం, రోజంతా శివనామస్మరణం. శివుడిని ప్రసన్నం చూసుకోవడానికి మంత్రాలు, స్తోత్రాలు చదవాల్సిన అవసరం లేదు. 'ఓం నమశ్శివాయ' అంటూ కాసిన్ని శుద్ధజాలాలు శివలింగానికి సమర్పించినా, శివుడు మురిసిపోయి ముక్తిని ప్రసాదిస్తాడు. పూజాసమయంలో తెలిసీతెలియక చేసిన అపరాధాలను మన్నించమని వేడుకుంటే చాలు ఆయన పెద్ద మనసుతో మన్నిస్తాడు. నిర్మలమైన హృదయంతో మారేడుదళాలను, ధూపదీప నైవేద్యాలను, తాంబూల దక్షిణలను, ఫలాలను పూజ సందర్భంగా సమర్పిస్తే చాలు ఆయన కరుణ లభిస్తుంది.
Friday, 1 March 2019
Subscribe to:
Posts (Atom)