Tuesday, 29 January 2019
Sunday, 27 January 2019
Friday, 25 January 2019
70 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు !
కుల-మత, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం. మన రాజ్యాంగాన్ని తయారుచేయడానికి ఎంతో మంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రూపొందించారు. మన రాజ్యాంగాన్ని రూపొందించిన తర్వాత డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి భారతదేశం పూర్తిగా ప్రజా ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. కానీ, ఆ అర్థం కాస్త నేడు రాజకీయనాయకులే ప్రభుత్వం, ప్రభుత్వమే రాజకీయనాయకులుగా మారిపోయింది. 70 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనదేశానికి తమ జీవితాన్ని అర్పించిన ఎందరో వీరుల త్యాగఫలాన్ని స్మరించుకుందాం.
Friday, 18 January 2019
నేడు 'అన్న' గారి వర్థంతి
నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగుజాతి మన్నలను
పొంది, సాంఘీక, జానపద, పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, తెలుగు సినీ
నందనవనంలో వెల్లివిరిసిన నవరస భరిత పారిజాతం యన్.టి.ఆర్. తెలుగువారి గుండెల్లో 'అన్న' గా ముద్రవేసుకున్న మరపురాని మరువలేని
మహానటుడు నందమూరి తారక రామారావు గారి వర్థంతి సందర్భంగా...
Monday, 14 January 2019
Monday, 7 January 2019
శక్తి స్వరూపిణి కామాక్షీదేవి అమ్మవారు
కామాక్షి అమ్మవారి దేవాలయం కంచి లో
ఉన్న ప్రముఖ దేవాలయం. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ
మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి
ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత
కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి
యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షి దేవి దివ్య
మంగళ రూపం నయన మనోహరం.
Friday, 4 January 2019
Wednesday, 2 January 2019
అత్యంత పవిత్ర స్థలం రామేశ్వరం
Subscribe to:
Posts (Atom)