మహిళలకు అత్యంత ముఖ్యమైనది... ప్రీతికరమైనది శ్రావణమాసం. అంతేకాదు మహిళలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం కూడానూ. అందుకే ఈ మాసమంతా మహిళలలో భక్తిభావం పొంగి పొర్లుతుంది. ఏ ఇంటిలో చూసినా వ్రతాలు, నోములతో ఆధ్యాత్మక భావం కనపడుతుంది. కుటుంబసభ్యుల సంక్షేమం కోసం వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. సృష్టి, స్థితి లయకారిణి అయిన అమ్మవారు అనంత శక్తి స్వరూపిని. ఈ ప్రపంచమంతా సర్వం తానై ఇమిడి ఉంది. అమ్మ కరుణఉంటేచాలు కష్టాలు, దుఃఖాలు అన్నీ క్షణంలో మటుమాయమైపోతాయి. సకల శుభాలనిచ్చే శ్రీ మహాలక్ష్మి శ్రావణమాసములో వరలక్ష్మిగా పూజలందుకుంటుంది. వరలక్ష్మిదేవిని భక్తితో పూజించి, నిష్టగా, నైవేద్యాలు సమర్పించిన వారింట అమ్మవారు కొలువై ఉంటుండని భక్తుల విశ్వాసం.
No comments:
Post a Comment