పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రాత్రి మహాశివరాత్రి. ఈ శుభకరమైన
శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ జాగారం చేస్తే అనుగ్రహప్రదాత అనుగ్రహం
కలుగుతుందని భక్తుల నమ్మకం. మనసుని పవిత్రంగా, ప్రశాంతంగా వుంచుకొని 'ఓం నమశ్శివాయ' అని జపించాగానే మహాశివుడు పరవశుడై అన్ని కష్టాలను తొలగిస్తాడు.
మనసులో నేనే గొప్ప అనే అహంకారాన్ని పెట్టుకుని ఆడంభరాలతో ఎన్ని పూజలు చేసినా ఫలితం మాత్రం దక్కదు. అహంభావాన్ని వదలి, అహంకారాన్ని వీడి అందరిని సమభావంతో ప్రేమిస్తే... శివయ్య కరుణాకటాక్షం లభిస్తుంది. ఈరోజు భక్తి శ్రద్ధలతో నిర్మలమైన మనస్సుతో శివతత్వాన్ని అర్థం చేసుకొంటే మనిషిలో మానవత్వం పరిమళిస్తుంది.
"పరమేశ్వరుని శుభదినం ...మహాశివరాత్రి పర్వదినం...భక్తజనకోటికి పుణ్యదినం"
No comments:
Post a Comment