”శోధిని”

Sunday 27 November 2016

బాబోయ్... రెండువేలనోటు !



ఒక మంచి లక్ష్యంతో కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తడం సహజం.  పెద్దనోట్ల రద్దుతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం.ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమే కానీ, అమలులో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన రెండువేల రూపాయల నోటు వల్ల పరిస్థితి మరింత చెయ్యిదాటి పోయింది. ఆనోటే సమాజంలో ప్రకంపనలు సృష్టించింది.   అన్ని రంగాలలో ఈ నోటు తీవ్ర ప్రభావితం చేసింది. సామాన్య జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. రెండువేల నోటు స్థానంలో అయిదువందల నోటు ప్రవేశపెట్టి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదికాదు. ఇప్పుడు రెండువేల నోటు ప్రజలకు తలనొప్పిగా మారింది.  దాన్ని చూడగానే ప్రజలు భయపడుతున్నారు.  ఈ నోటే దేశంలో చిల్లర సమస్యను తెచ్చిపెట్టింది.  ఈ నోటువల్ల సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగాలేదని స్పష్టంగా  అర్థమవుతోంది.  చిన్న వ్యాపారాల మీద ఈ పెద్దనోటు ప్రభావం తీవ్రంగా ఉంది. తక్షణమే అయిదువందల నోట్లు దేశమంతా అమలులోకి వస్తే, నోట్ల సమస్య అతిత్వరగా సమసిపోతుంది. అన్ని బ్యాంకుల్లోనూ,  ఏటియంలలోనూ వంద, అయిదువందల నోట్లు విరివిగా పంపిస్తే, ప్రధాని ప్రయత్నం సఫలం అవుతుంది. 

2 comments:

sap hana said...

రెండువందలనోటు ! ... రెండు వేల నోటుకదా...

విన్నకోట నరసింహా రావు said...

రెండు వందల నోటు అని హెడింగ్ మీరు కావాలనే పెట్టారో లేదో తెలియదు గానీ నిజానికి ప్రభుత్వం రెండు వందల రూపాయల నోటు ప్రవేశపెడితే బాగుండేదని నా అభిప్రాయం. చిల్లర సమస్య ఇంత తీవ్రతరం అయ్యుండేది కాదేమో?