Thursday, 13 October 2016
Monday, 10 October 2016
సర్వశక్తి స్వరూపిణి
కోట్లానుకోట్ల జీవరాశులల్లో ఉండే జీవరూపశక్తి, సకల సృష్టికి కార్యకారణరూపిణి అయిన ఆదిపరాశక్తి...దుర్మార్గుల పై విజయఢంకా మోగించి, అఖిలలోకాలచేత కీర్తించబడే సర్వశక్తి స్వరూపిణి కనకదుర్గ. సర్వ సృష్టిని సస్యశ్యామలంగా చేసే తల్లి కనుక శాకంబరీదేవిగా కూడా పిలవబడుతూ, శరన్నవరాత్రులల్లో ఆదిపరాశక్తిని తొమ్మిది అవతారాల్లో పూజించి, పదవరోజు శివశక్తుల కలయికగా శ్రీరాజరాజేస్వరీదేవిని స్తుతిస్తాం. సృష్టిలోని ఆణువణువూ అమ్మ ప్రతిరూపమే. ఓంకారాన్ని సృష్టించిన శక్తే జగన్మాత. ఆమె సృష్టిలయకారిణి...జగదేకస్వరూపిని...సకలచరాచరణి. వీరత్వానికి ప్రతీకయినా దుర్గాదేవిని ఎన్ని విధాలుగా, ఎన్ని రూపాలుగా కీర్తించినా, అర్చించినా అవన్నీ ఆదిపరాశక్తి జగన్మాతకే చేరుతాయి.
మిత్రులందరికీ విజయదశమి శుభాకాంక్షలు !
Sunday, 9 October 2016
"బతుకమ్మ పండుగ "
దేవిశరన్నవరాత్రులలో ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ బతుకమ్మ పండుగ. అసమానతలను ఎదురిద్దాం...ఆత్మగౌరవంతో బతుకుదాం అంటూ ఆడపడుచులు ఉత్సాహంగా , ఆనందంగా ఎంతో సంబరంగా ఈ పండుగను జరుపుకుంటారు. ముత్తయిదువులంతా గౌరీదేవి దీవెనలను కోరుతూ... తమ మాంగల్య సౌభాగ్యం చల్లగా ఉండాలని ప్రార్థిస్తే, యువతులు తమకు మంచి భర్త లభించి, దాంపత్య జీవనం సుఖసంతోషాలతో సాగాలని వేడుకుంటారు. బతుకమ్మ పండుగ వచ్చే సమయానికి చెట్లు ఆకులతో అల్లుకుపోతాయి. భూమి పచ్చదనం పర్చుకుంటుంది. బతుకమ్మను తయారుచేసే తంగేడు, మునుగు, బంతి, చామంతి, గన్నేరు, జిల్లేడు, తామర, గుమ్మడి, గడ్డి పువ్వులు లాంటి రంగురంగుల పూలు వికసిస్తాయి. కుల, మతాలకతీతంగా వాడవాడలో జరుపుకునే బతుకమ్మ పండుగ ముఖ్య ఉద్దేశం ప్రకృతిని, మహిళలను గౌరవించాలని.
Saturday, 1 October 2016
మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !
దేశంలోశాంతి, మతసామరస్యం నెలకొల్పేందుకు కృషిచేసిన మహాత్మాగాంధీ గారు చూపిన బాటలో పయనిద్దాం.... మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం..... దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిద్దాం !
స్వచ్చమైన పరిపాలన అందించి, మచ్చలేని ప్రధానమంత్రిగా.... పొట్టివాడయినా మహాగట్టివాడని అందరి మన్నలను పొందిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని గుర్తుచేసుకుందాం. ఈ తరంవారికి తెలియచేద్దాం !
మహాత్ములు నేర్పిన పాఠాలు ... మనకు మార్గదర్శకాలు !
Subscribe to:
Posts (Atom)