”శోధిని”

Tuesday, 17 November 2015

కొందరు వ్యక్తులు ...!

కొందరు 'ఎంచేసినా చెల్లుతుందని...  వాళ్ళు చెప్పిందే వేదం' అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.  అంతేకాదు అనాలోచితంగా, అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని చిన్న చూపు చూడటం వారికి అలవాటు.   పెద్దలను గౌరవించకపోవడం,  ఎదుటివారిని బాధించేలా మాట్లాడటం, మనసు నిండా అసూయ  నింపుకొని కుటిల బుద్ది చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య.  వీరికి నిజం మాట్లాడే వ్యక్తులంటే మహా చికాకు.  వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపే వాళ్ళంటే వళ్ళంతా  కంపరం.  మంచివారితో స్నేహం చేయడం అసలు ఇష్టం ఉండదు.  ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం వంటి అవలక్షణాల వల్ల ఎప్పుడూ  అసహానానికి గురవుతూ ఉంటారు.  వారు చేసేది 'తప్పు' అని వారి ఆత్మకు తెలుసు.  కాని,  సమాజంలో 'ప్రజా సేవకులు'గా గుర్తింపుకోసం అడ్డదారులు తొక్కుతూ నీతిమంతులుగా చెలామణి అవుతున్నారు.
   

No comments: