Saturday, 28 November 2015
Friday, 27 November 2015
Wednesday, 25 November 2015
Tuesday, 24 November 2015
కార్తీక దీపం !
మాసాలలో కార్తీక మాసం, తిధుల్లో పున్నమి పవిత్రమైనవి. ఈ రెండూ సమన్వయం కార్తీక దీపం. ఈ రోజున శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉపవాసాలు, అభిషేకాలు, వ్రతాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలతో కార్తీక పౌర్ణమి నాడు గృహాలు, దేవాలయాలు కళకళ లాడుతూ ఉంటాయి. దీపాల వరుస చూస్తుంటే, ఎంతో రమ్యంగా, నేత్రపర్వంగా, హృదయానందకరంగా ఉంటుంది.
Saturday, 21 November 2015
కార్తీక దీపం ... సర్వపాపహరణం!
శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం ... కార్తీకమాసం! ఈ మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయాలలో ద్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపం ద్వజస్తంభంపై వెలుగులీనుతూ ఉంటుంది. దీపం ఆత్మ స్వరూపం. కార్తీక దీపం ... సర్వపాపహరణం! జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి రోజూ శక్తివంతమైన రోజులే. అయితే సోమవారాలకు అత్యంత ప్రధాన్యత ఉంది. సోమవారం అంటే అభిషేక ప్రియుడికి పీతికరమైన రోజుకే కాబట్టి. ఆరోజు చేసే అభిషేకాలకు పరమేశ్వరుడు ఎక్కువగా ఇష్టపడతాడు. అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశి, పున్నమి పరమ పవిత్ర దినాలు.
Friday, 20 November 2015
Tuesday, 17 November 2015
కొందరు వ్యక్తులు ...!
కొందరు 'ఎంచేసినా చెల్లుతుందని... వాళ్ళు చెప్పిందే వేదం' అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాదు అనాలోచితంగా, అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని చిన్న చూపు చూడటం వారికి అలవాటు. పెద్దలను గౌరవించకపోవడం, ఎదుటివారిని బాధించేలా మాట్లాడటం, మనసు నిండా అసూయ నింపుకొని కుటిల బుద్ది చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య. వీరికి నిజం మాట్లాడే వ్యక్తులంటే మహా చికాకు. వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపే వాళ్ళంటే వళ్ళంతా కంపరం. మంచివారితో స్నేహం చేయడం అసలు ఇష్టం ఉండదు. ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం వంటి అవలక్షణాల వల్ల ఎప్పుడూ అసహానానికి గురవుతూ ఉంటారు. వారు చేసేది 'తప్పు' అని వారి ఆత్మకు తెలుసు. కాని, సమాజంలో 'ప్రజా సేవకులు'గా గుర్తింపుకోసం అడ్డదారులు తొక్కుతూ నీతిమంతులుగా చెలామణి అవుతున్నారు.
Monday, 16 November 2015
పుట్టలో పాలు !
అమ్మా...మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా పైన భక్తీ ఉంటే ... పూజించండి, ఆరాదించండి పుణ్యం వస్తుంది. అంతే కాని, పుట్టలో కల్తీపాలు పోసి మా సర్పజాతిని నాశనం చేయకండి. పూర్వం స్వచ్చమైన క్షీరాన్ని ఆస్వాదించేవాళ్ళం.... హాయిగా జీవించేవాళ్ళం. నేడు ఆ పరిస్థితి లేదు. మీరు పోసే కల్తీ పాలతో ఊపిరి ఆడక ప్రాణాలు వదులుతున్నాం. దయచేసి పుట్టలో పాలు పోయకండి. మా ప్రాణాలు తీయకండి !
Saturday, 14 November 2015
పెద్దవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే ! (జోక్)
పని మనిషి : ఏంటి అమ్మగారు సడన్ గా పని మానేయమంటున్నారు ?
యజమానురాలు : మీ అయ్యగారు రేపు రిటైర్ అవుతున్నాడు తెలుసు కదా !
పని మనిషి : అయ్యగారి రిటైర్ కి నా పనికి ఏమిటమ్మ సంబంధం ?
యజమానురాలు : అది నీకు చిప్పినా అర్థం కాదులే !
పని మనిషి : ' ఏమిటో ఈపెద్దోలు... ఇంట్లో వారిని కంట్రోల్ చేయలేక మమ్మల్ని బలిపశువును చేస్తారు'.
అనుకుంది మనసులో.
యజమానురాలు : మీ అయ్యగారు రేపు రిటైర్ అవుతున్నాడు తెలుసు కదా !
పని మనిషి : అయ్యగారి రిటైర్ కి నా పనికి ఏమిటమ్మ సంబంధం ?
యజమానురాలు : అది నీకు చిప్పినా అర్థం కాదులే !
పని మనిషి : ' ఏమిటో ఈపెద్దోలు... ఇంట్లో వారిని కంట్రోల్ చేయలేక మమ్మల్ని బలిపశువును చేస్తారు'.
అనుకుంది మనసులో.
Thursday, 12 November 2015
దానిమ్మ గింజలు !
ఎర్రగా...ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోయే దానిమ్మ గింజలు మన ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తూ వృధాప్యాన్ని దూరం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరచి, ఎముకులు గట్టిపడటానికి దోహదపడతాయి. వయసు పెరిగేకొద్దీ చర్మంపై ఏర్పడే ముడతలను దానిమ్మ రసం నివారిస్తుంది. నోటిపూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తూ దంతాలు, చిగుళ్ళు గట్టిపడేలా చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పొతే దానిమ్మ గింజల వల్ల బోలెడు లాభాలున్నాయి.
Tuesday, 10 November 2015
వెలుగు దివ్వెల పండుగ ... దీపావళి పండుగ !
అహంకారాన్ని అణచివేసి,
చెడుపై విజయం సాధించడంతో కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా
జరుపుకునే పండుగ దీపావళి. 'చెడు' అనే చీకటిని పారద్రోలి 'మంచి' అనే
వెలుగును నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోజున లక్ష్మిదేవిని
భక్తి శ్రద్దలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం సిద్దిస్తుందని ప్రజల విశ్వాసం.
మన భారతీయ సంప్రదాయాలలో దీపానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. దీపం
మహాలక్ష్మి స్వరూపం. అందుకే 'దీపం జ్యోతి పరబ్రహ్మ' అన్నారు. దీపం
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అమావాస్య నాడు వచ్చే ఈ
పండుగనాడు ఇంటింటా దీపాలు వెలుగులు, ఆకాశంలో తారాజువ్వల కాంతులు, దేశమంతా
ఆనంద కోలాహాలు, మనసున ఉప్పొంగే ఉత్సాహం. ఈ దివ్యకాంతుల దీపావళి మీ
ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సిరిసంపదలు, మధురానుభూతులు మిగిల్చాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ....
అందరికీ దీపావళి శుభాకాంక్షలు !
Saturday, 7 November 2015
Friday, 6 November 2015
Monday, 2 November 2015
Subscribe to:
Posts (Atom)