భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేకస్థానం ఉంది. హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా. అది ఎన్నోమొండి రోగాలను నయం చేస్తుంది. రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే వ్యాధుల దరిచేరవంటారు. మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు. ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.
Tuesday, 30 June 2015
Sunday, 28 June 2015
Saturday, 27 June 2015
విమాన వెంకటేశ్వర స్వామి
తిరుమలలో శ్రీవారిని దర్శించి బయటకు వచ్చేటప్పుడు ఉత్తర దిశలో "విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించండి" అని బాణం గుర్తు చూపుతూ బోర్డు ఉంటుంది. విమాన వెంకటేశ్వర స్వామికి వెండి మకర తోరణాన్నిఏర్పాటుచేయడాన్నిగమనించవచ్చు. విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే, మూలవిరాటైన శ్రీవారిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. సరిగా స్వామివారి దర్శనం కలగనప్పుడు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించవచ్చు.
Friday, 26 June 2015
Sunday, 21 June 2015
యోగామృతం !
'యోగ' అనేది ఏ మతానికో, సంస్కృతికో సంబంధించింది కాదు. ఇది సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది. మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని. ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని. అంతేకాకుండా అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి కుళ్ళు, కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోద్యప్రదాయిని. శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే గొప్ప సాధనం 'యోగ'.
Wednesday, 17 June 2015
Tuesday, 16 June 2015
కమ్మని మట్టి పరిమళాలు !
నింగి నిండా మేఘమాలికలు
కమ్ముకోగా మెరిసింది మెరుపు
ఆహ్లాదకరమైన చల్లని గాలులు
ప్రకృతి అంతా విస్తరించగా ...
వెలసింది సప్తవర్ణాల హరివిల్లు !
ఆ అపురూప దృశ్యాన్ని చూసి
దేవతలు అక్షింతలు చల్లి దీవించినట్లు
నింగి నేలను కలుపుతూ...
కురిశాయి తొలకరిజల్లులు !
పుడమితల్లి ఆనందంతో పులకించి
మట్టి పరిమళాలను వెదజల్లగా ...
కమ్మని వాసన పరిసరాలను
మురిపించింది ...మైమరపించింది!
ప్రకృతి అంతా విస్తరించగా ...
వెలసింది సప్తవర్ణాల హరివిల్లు !
ఆ అపురూప దృశ్యాన్ని చూసి
దేవతలు అక్షింతలు చల్లి దీవించినట్లు
నింగి నేలను కలుపుతూ...
కురిశాయి తొలకరిజల్లులు !
పుడమితల్లి ఆనందంతో పులకించి
మట్టి పరిమళాలను వెదజల్లగా ...
కమ్మని వాసన పరిసరాలను
మురిపించింది ...మైమరపించింది!
Thursday, 11 June 2015
ముసుగు దొంగలు (జోక్)
మంత్రిగారి భార్య తన భర్తతో కలసి న్యూస్ ఛానల్ చూస్తోంది.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా నన్నెవరూ గుర్తుపట్టడం లేదు" అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా నన్నెవరూ గుర్తుపట్టడం లేదు" అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.
Sunday, 7 June 2015
పంచభూత లింగాలు !
పంచభూతాత్మక స్వరూపుడు పరమశివుడు. పంచలింగ ప్రతీకలే పంచభూత లింగాలు. కంచిలో స్వామి పృధ్వీలింగ రూపంలో, తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీకగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా మహాశివుడు పూజలు అందుకుంటున్నాడు. దోసెడు నీళ్ళతో అభిషేకం ...చిటెకెడు బూడిద అలంకారం ...శంభో శంకర అంటే చాలు, అంతకు మించి ఏమి కోరుకోని భోళాశంకరుడు ఆయన.
Friday, 5 June 2015
పర్యావరణ పరిరక్షణ ...ప్రగతికి సోపానం !
Thursday, 4 June 2015
Subscribe to:
Posts (Atom)