బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం ఉంది. కాని, అది ఆచరణలో మాత్రం ఆమడ దూరంలో ఉంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అంతగా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సంబందిత అధికారులు సైతం తగు చర్యలు తీసుకోవడంపై అంతగా దృష్టి సారించలేక పోతున్నారు. ఫలితంగా బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం యదేచ్చగా కొనసాగుతోంది. మొదట్లో కాస్త హడావుడి కనిపించినప్పటికీ ఆ తురువాత నిషేధం మాట మరచిపోయారు. ఇదే ఆసరాగా తీసుకొని పొగరాయుళ్ళు పొగను ఇష్టమొచ్చినట్టు ఊదేస్తూ హల్ చల్ చేస్తున్నారు. సిగరెట్టు పొగతో వాతావరణాన్ని కలుషితం చేస్తూ ... ఇతరులకు తీవ్ర ఇబ్బంది కలుగ జేస్తున్నారు. పొగ త్రాగడం నేటి యువతకి ఒక ప్యాషన్ అయిపొయింది. ధూమపానం వల్ల భయంకరమైన వ్యాధులు వస్తాయని తెలిసీ కూడా సిగరెట్టుకు బానిసలవుతున్నారు. సిగరెట్టు త్ర్రాగే వారికంటే ప్రక్కనున్న వారికే ఎక్కువ ప్రభావం చూపుతుందనేది జగమెరిగిన సత్యం. బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్లను కాల్చుతున్న వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా అధికారులు పోగరాయుళ్ళపై చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది.
1 comment:
చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు నాగేంద్ర గారు . ఈ దేశంలో చర్య తీసుకునే అవకాశం ,శ్రద్ద ఉందంటారా ? ఎదో బతికేస్తున్నాం అంతే !
Post a Comment