”శోధిని”

Monday, 12 January 2015

"సంక్రాంతి సంబరాలు"



'అంబ పలుకు జగదాంబ పలుకు' అంటూ కీర్తించే
బుడబుక్కల వాళ్ళ డమరుక ద్వని ...
'హరిలో రంగ హరీ ' అంటూ దీవించే
హరిదాసుల విష్ణునామ సంకీర్తనలు ...
జంగ దేవరుల ఇత్తడి ఘంటా ద్వనులు ...
పితృల ఋణం తీర్చే పితృతర్పణాలు ...
బోగిమంటలు, కోడి పందాలు ...
పిట్టల దొరలు, చెంచు నాయకులు ...
గంగెరెద్దుల విన్యాసాలు, గాలిపటాలు ...
వాకిట ముంగిట్లో విరబూసిన రంగవల్లులు...
గౌరీదేవి ప్రతిరూపాలయిన గొబ్బేమ్మలు ...
బొమ్మల కొలువులతో విరిసే చిన్నారుల బోసినవ్వులు ...
ఇంటింటా సంక్రాంతి ...వాడవాడకు క్రాంతి
ఊరంతా సంక్రాంతి సంబరాలు, సరదాలు...
మన సంస్కృతిని భావితరాలవారికి అందించే
ముచ్చటగా మూడురోజుల పండుగ
జరుపుకోకపోతే జీవితమే దండగ !

1 comment:

వనజ తాతినేని/VanajaTatineni said...

చాలా బావుంది .. నాగేంద్ర గారు . అభినందనలు . పండుగ ని ఇక్కడ చూసాను . గతమెంతో ఘనం .