Thursday, 31 December 2015
Wednesday, 30 December 2015
Thursday, 24 December 2015
ప్రేమతో ఎదైనా సాధించవచ్చు !
'ప్రేమతో ఎదైనా సాధించవచ్చని' జీసస్ చెప్పారు. నువ్వు ఎదుటివారిని మనస్పూర్తిగా ప్రేమిస్తే ...నిన్ను కూడా అవతలి వాళ్ళు అంతే ఇష్టంగా ప్రేమిస్తారు. మన కోసం కాకుండా ఇతరుల కోసం ప్రార్థన చేయాలి.... అందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలి....సాటి మనిషిని మనస్పూర్తిగా ప్రేమించడం నేర్చుకోవాలి. ఇతరుల సంతోషం కోసం, వారి సుఖసౌఖ్యాల కోసం ప్రార్థన చేయాలి. స్వార్థపూరితమైన ప్రార్థనలను దేవుడు మెచ్చడు. నీతి, నిజాయితీగా నడిస్తే ఏసుక్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు. మన మనసు పరిశుద్ధంగా వుంచుకున్నప్పుడే దేవుడు మనలో ప్రవేశిస్తాడు. సంపూర్ణమైన ఆయన ఆశీర్వాదం, ఆశీస్సులు లభిస్తాయి.
మిత్రులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు !
Wednesday, 23 December 2015
Monday, 21 December 2015
ముక్కోటి దర్శనం !
ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమలలో శ్రీవారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వర్ణరథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమిచ్చారు. వేయి కళ్ళతో ఎదురు చూసిన భక్తజనం శ్రీవారి ఉత్తర దివ్యదర్శనంతో పులకించి పోయారు. భక్తి పారవశ్యంలో మినిగి పోయారు. మరో ప్రక్క బంగారు కాంతులీనే ఆనంద నిలయం. ఎటు చూసినా అన్నమయ్య కీర్తనలు, భజనలు, కోలాటాలు చేసే బృందాలు...గోవిందనామస్మరణలు. భక్తుల ముఖాల్లో ఆనందం ...సంతృప్తి.
Thursday, 17 December 2015
Sunday, 13 December 2015
వీళ్ళు మారరు (జోక్)
ఎప్పుడూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూచేసే విలేఖరికి ఓ ఐడియా వచ్చి, బిక్షగాడిని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు.
"మీకు అనుకోకుండా రోడ్డు మీద లక్ష రూపాయలు దొరికితే ఏంచేస్తారు?" బిక్షగాడిని అడిగాడు విలేఖరి." వెండి బొచ్చెలో అడుక్కుంటాను"
"అదే పది లక్షలు దొరికితే ?"
"బంగారు బొచ్చెలో అడుక్కుంటాను"
"కోటి రూపాయలు దొరికితే?"
"విమానం టిక్కెట్టు కొని విమానంలో అడుక్కుంటా!"
ఆశ్చర్య పోవడం విలేఖరి వంతయింది.
Saturday, 12 December 2015
"పర్ణశాల"

శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు భద్రాచలంకు 33 కిలోమీటర్ల దూరంలో
వున్న పర్ణశాలలో నివసించినట్లు, ఇక్కడున్న వాగు వద్ద సీతాదేవి స్నానం
చేసిన తరువాత గుట్ట పైన చీరలు ఆరవేయగా, రాళ్ళ పైన చీరల ఆనవాళ్ళు
ఏర్పడ్డాయని కథలుగా చెప్పుకుంటారు.
Friday, 11 December 2015
Tuesday, 8 December 2015
Friday, 4 December 2015
Saturday, 28 November 2015
Friday, 27 November 2015
Wednesday, 25 November 2015
Tuesday, 24 November 2015
కార్తీక దీపం !
మాసాలలో కార్తీక మాసం, తిధుల్లో పున్నమి పవిత్రమైనవి. ఈ రెండూ సమన్వయం కార్తీక దీపం. ఈ రోజున శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఉపవాసాలు, అభిషేకాలు, వ్రతాలు, ప్రత్యేక పూజలు, దీపారాధనలతో కార్తీక పౌర్ణమి నాడు గృహాలు, దేవాలయాలు కళకళ లాడుతూ ఉంటాయి. దీపాల వరుస చూస్తుంటే, ఎంతో రమ్యంగా, నేత్రపర్వంగా, హృదయానందకరంగా ఉంటుంది.
Saturday, 21 November 2015
కార్తీక దీపం ... సర్వపాపహరణం!
శివునికి ఎంతో ప్రీతికరమైన మాసం ... కార్తీకమాసం! ఈ మాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. దేవాలయాలలో ద్వజస్తంభానికి తాడు కట్టి చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపం ద్వజస్తంభంపై వెలుగులీనుతూ ఉంటుంది. దీపం ఆత్మ స్వరూపం. కార్తీక దీపం ... సర్వపాపహరణం! జ్యోతి స్వరూపమైన పరమాత్మ అందరిలోనూ ప్రకాశిస్తుంటాడు. కార్తీకమాసంలో వచ్చే ప్రతి రోజూ శక్తివంతమైన రోజులే. అయితే సోమవారాలకు అత్యంత ప్రధాన్యత ఉంది. సోమవారం అంటే అభిషేక ప్రియుడికి పీతికరమైన రోజుకే కాబట్టి. ఆరోజు చేసే అభిషేకాలకు పరమేశ్వరుడు ఎక్కువగా ఇష్టపడతాడు. అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ఏకాదశి, పున్నమి పరమ పవిత్ర దినాలు.
Friday, 20 November 2015
Tuesday, 17 November 2015
కొందరు వ్యక్తులు ...!
కొందరు 'ఎంచేసినా చెల్లుతుందని... వాళ్ళు చెప్పిందే వేదం' అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాదు అనాలోచితంగా, అహంకారపూరితంగా ప్రవర్తిస్తూ ఎదుటివారిని చిన్న చూపు చూడటం వారికి అలవాటు. పెద్దలను గౌరవించకపోవడం, ఎదుటివారిని బాధించేలా మాట్లాడటం, మనసు నిండా అసూయ నింపుకొని కుటిల బుద్ది చూపడం వారికి వెన్నతో పెట్టిన విద్య. వీరికి నిజం మాట్లాడే వ్యక్తులంటే మహా చికాకు. వాళ్ళు చేసే తప్పులను ఎత్తి చూపే వాళ్ళంటే వళ్ళంతా కంపరం. మంచివారితో స్నేహం చేయడం అసలు ఇష్టం ఉండదు. ఈర్ష్య, అసూయ, ఓర్వలేనితనం వంటి అవలక్షణాల వల్ల ఎప్పుడూ అసహానానికి గురవుతూ ఉంటారు. వారు చేసేది 'తప్పు' అని వారి ఆత్మకు తెలుసు. కాని, సమాజంలో 'ప్రజా సేవకులు'గా గుర్తింపుకోసం అడ్డదారులు తొక్కుతూ నీతిమంతులుగా చెలామణి అవుతున్నారు.
Monday, 16 November 2015
పుట్టలో పాలు !
అమ్మా...మిమ్మల్ని వేడుకుంటున్నాం. మా పైన భక్తీ ఉంటే ... పూజించండి, ఆరాదించండి పుణ్యం వస్తుంది. అంతే కాని, పుట్టలో కల్తీపాలు పోసి మా సర్పజాతిని నాశనం చేయకండి. పూర్వం స్వచ్చమైన క్షీరాన్ని ఆస్వాదించేవాళ్ళం.... హాయిగా జీవించేవాళ్ళం. నేడు ఆ పరిస్థితి లేదు. మీరు పోసే కల్తీ పాలతో ఊపిరి ఆడక ప్రాణాలు వదులుతున్నాం. దయచేసి పుట్టలో పాలు పోయకండి. మా ప్రాణాలు తీయకండి !
Saturday, 14 November 2015
పెద్దవాళ్ళ మాటలకు అర్థాలు వేరులే ! (జోక్)
పని మనిషి : ఏంటి అమ్మగారు సడన్ గా పని మానేయమంటున్నారు ?
యజమానురాలు : మీ అయ్యగారు రేపు రిటైర్ అవుతున్నాడు తెలుసు కదా !
పని మనిషి : అయ్యగారి రిటైర్ కి నా పనికి ఏమిటమ్మ సంబంధం ?
యజమానురాలు : అది నీకు చిప్పినా అర్థం కాదులే !
పని మనిషి : ' ఏమిటో ఈపెద్దోలు... ఇంట్లో వారిని కంట్రోల్ చేయలేక మమ్మల్ని బలిపశువును చేస్తారు'.
అనుకుంది మనసులో.
యజమానురాలు : మీ అయ్యగారు రేపు రిటైర్ అవుతున్నాడు తెలుసు కదా !
పని మనిషి : అయ్యగారి రిటైర్ కి నా పనికి ఏమిటమ్మ సంబంధం ?
యజమానురాలు : అది నీకు చిప్పినా అర్థం కాదులే !
పని మనిషి : ' ఏమిటో ఈపెద్దోలు... ఇంట్లో వారిని కంట్రోల్ చేయలేక మమ్మల్ని బలిపశువును చేస్తారు'.
అనుకుంది మనసులో.
Thursday, 12 November 2015
దానిమ్మ గింజలు !
ఎర్రగా...ఎంతో ఆకర్షణీయంగా మెరిసిపోయే దానిమ్మ గింజలు మన ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం చేస్తూ వృధాప్యాన్ని దూరం చేస్తాయి. జీర్ణక్రియను మెరుగు పరచి, ఎముకులు గట్టిపడటానికి దోహదపడతాయి. వయసు పెరిగేకొద్దీ చర్మంపై ఏర్పడే ముడతలను దానిమ్మ రసం నివారిస్తుంది. నోటిపూత నుంచి ఉపశమనాన్ని కలుగచేస్తూ దంతాలు, చిగుళ్ళు గట్టిపడేలా చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పొతే దానిమ్మ గింజల వల్ల బోలెడు లాభాలున్నాయి.
Tuesday, 10 November 2015
వెలుగు దివ్వెల పండుగ ... దీపావళి పండుగ !
అహంకారాన్ని అణచివేసి,
చెడుపై విజయం సాధించడంతో కులమతాలకు అతీతంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా
జరుపుకునే పండుగ దీపావళి. 'చెడు' అనే చీకటిని పారద్రోలి 'మంచి' అనే
వెలుగును నింపడమే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ రోజున లక్ష్మిదేవిని
భక్తి శ్రద్దలతో పూజిస్తే లక్ష్మి కటాక్షం సిద్దిస్తుందని ప్రజల విశ్వాసం.
మన భారతీయ సంప్రదాయాలలో దీపానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. దీపం
మహాలక్ష్మి స్వరూపం. అందుకే 'దీపం జ్యోతి పరబ్రహ్మ' అన్నారు. దీపం
అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అమావాస్య నాడు వచ్చే ఈ
పండుగనాడు ఇంటింటా దీపాలు వెలుగులు, ఆకాశంలో తారాజువ్వల కాంతులు, దేశమంతా
ఆనంద కోలాహాలు, మనసున ఉప్పొంగే ఉత్సాహం. ఈ దివ్యకాంతుల దీపావళి మీ
ఇంటిల్లిపాదికీ సుఖశాంతులు, సిరిసంపదలు, మధురానుభూతులు మిగిల్చాలని
మనస్పూర్తిగా కోరుకుంటూ....
అందరికీ దీపావళి శుభాకాంక్షలు !
Saturday, 7 November 2015
Friday, 6 November 2015
Monday, 2 November 2015
Saturday, 31 October 2015
"జ్ఞానోదయం "
ఎన్నికల సందర్భంగా జరుగుతున్న మీటింగ్ లో
ఓ నాయకుడు మాట్లాడుతూ ... "బిసీ, ఒసీల పక్షపాతి మన మంత్రిగారు" అన్నాడు.
మరో నాయకుడు మాట్లాడుతూ ...
"ఎస్సీ , ఎస్టీల పక్షపాతి మన నాయకుడు" అన్నాడు.
ఎన్నికలు రానే వచ్చాయి
"మంత్రి గారు బిసీ, ఒసీల పక్షపాతి కాబట్టి
మన కులాలవాళ్లు అతనికి ఓటు వేయవద్దు"
అని ఎస్సీ , ఎస్టీల ఓటర్లు నిర్ణయించుకున్నారు.
"మంత్రిగారు ఎస్సీ , ఎస్టీల పక్షపాతి కాబట్టి ...
మనమంతా కలిసికట్టుగా అతన్ని ఓడించాలి "
అని బిసీ, ఒసీల ఓటర్లు నిర్ణయం తీసుకోవడంతో
మంత్రిగారు భారీ మెజారిటీతో ఓడిపోయారు.
అప్పటి నుంచి కులాల పేరుతో
ఓట్లు అడగకూడదని మంత్రిగారికి జ్ఞానోదయం అయింది.
Tuesday, 27 October 2015
పండ్లు ... ఆరోగ్యానికి పుండ్లు !
కాయలను ఒక్కరోజులోనే పండ్లుగా భ్రమింపచేయడానికి అక్రమ వ్యాపారులు విషపూరిత రసాయనాలను వాడి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. పక్వానికిరాణి పచ్చికాయలను తెంపి రంగు తెచ్చేందుకు కాల్షియం కార్బైండ్ ను వినియోగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఒక్క రోజులోనే పండు రంగు వచ్చి, పచ్చి కాయలు నిగనిగలాడుతూ ఆకర్షణీయంగా కనిపించడంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాల్షియం కార్బైండ్ మనుష్యుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విషం. ఇలా కృత్రిమ పద్దతుల్లో మగ్గించిన పండ్లను తింటే అల్సర్, క్యాన్సర్, కాలేయం, మూత్ర పిండాలు పాడవడం జరుగుతుంది. ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే పండ్లు రోగాలు తెచ్చి పెడుతున్నాయంటే నమ్మశఖ్యంగా లేదు కదూ! డబ్బులు పెట్టి జబ్బులను కొంటున్నారు ఇది పచ్చి నిజం. ప్రకృతి సిద్ధంగా పండిన పండ్లు నేడు మార్కెట్లో కనపడడంలేదంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. అందుకే పండ్లను కొనేముందు బాగా పరిశీలించి కొనండి. రసాయనాలతో మగ్గించిన పండ్లను సులభంగా గుర్తుపట్టవచ్చు. రసాయనాలతో మగ్గిన పండ్లు గట్టిగా, పసుపు వర్ణంతో నిగనిగలాడుతూ ఉంటాయి. ఈ తేడాను గుర్తిస్తే ఆరోగ్యాన్నిచ్చే ప్రకృతి సిద్దమైన పండ్లనను కొని తినవచ్చు.
Sunday, 25 October 2015
Saturday, 24 October 2015
Thursday, 22 October 2015
జమ్మిచెట్టు పైన పాలపిట్ట !
విజయదశమి పర్వదినాన పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా జమ్మి చెట్టును పూజించె సంప్రదాయం అనాదిగా వస్తోంది. జమ్మి చెట్టును పూజిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయంటారు. కాని, దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో పక్షులు కూడా అంతరించి పోతున్నాయి. మట్టి ప్రదేశాలన్నీ కాంక్రీట్ గా మారడంతో జమ్మి చెట్లు కనుమరుగయి పొతున్నాయి. ఇలాంటి సమయాలలో దసరా నాడు పాలపిట్ట చిత్రాన్ని చూసి సంతృప్తి చెందుదాం.
Wednesday, 21 October 2015
విజయదశమి శుభాకాంక్షలు !
పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించినదైనా దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. వివిధ సంస్కృతీ సంప్రదాయాలతో కలిసిన పండుగలు సంప్రదాయశోభను ద్విగుణీకృతం చేస్తూ మానసికమైన ఆనందాన్ని, తృప్తిని ఇస్తాయి. అందుకే ప్రతి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ముఖ్యంగా దసరా పండుగ ఆశ్వయుజ మాసంలో తొమ్మిది రోజులు అమ్మవారు వివిధ రూపాలలో దర్శనమిస్తారు. చివరి రోజు మహిషాసురుడిని సంహరించడంతో 'సమాజంలోని దుర్మార్గం నశించి మంచి మానవత్వం పెరగాలని కోరుకుంటూ' పదవరోజు విజయదశమి పండుగను జరుపుకోవడం ఆనవాయితి. విజయదశమి నాడు దుర్గాదేవిని ఆరాదిస్తే అన్నిటా విజయం సిద్ధిస్తుందని ప్రజల విశ్వాసం. ఈ రోజున ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు, ప్రతి గుమ్మానికి బంతిపూలు, మామిడాకుల తోరణాలతో కళకళ లాడటం దసరా పండుగ ప్రత్యేకత. విజయదశమి పర్వదినం సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సుఖశాంతులు ప్రసాదించాలని దుర్గాదేవిని మనసారా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు.
Monday, 19 October 2015
Sunday, 18 October 2015
శ్రీ లలితా పరమేశ్వరి !
విలాసం, ఔదార్యం, గాంభీరం, మాధుర్యం, తేజస్సు, సౌకుమార్యం కలిసిన స్త్రీ మూర్తి శ్రీ లలితా త్రిపుర సుందరి. లాలిత్యం, కారుణ్యం, అనురాగం, ఆత్మీయత ఆమె స్వభావాలు. పేరులోనే లాలిత్యం ఉన్న లలితా పరమేశ్వరి, ప్రాణ కోటికి అండగా నిలిచిన జగన్మాత. స్త్రీని దేవతగా పూజించే మనం... మనకు జన్మనిచ్చిన మహిళలకు తగిన గౌరవ మర్యాదలు ఇస్తూ... మంచి ప్రవర్తన కలిగి ఉంటే , జగన్మాతను అర్చించినంత ఫలితం దక్కుతుంది.
Wednesday, 14 October 2015
Monday, 12 October 2015
Saturday, 10 October 2015
తన కోపమే తన శత్రువు !
కోపం ఒక భావోద్వేగం. అనుకున్నది అనుకున్నట్లు జరగక పోయినా ఎదైనా అసౌకర్యం కలిగినా, ఎదుటివారి ప్రవర్తన చికాకు కలిగించినా కోపగించడం మానవ నైజం. కోపం ఎందుకు వస్తుందో ముందుగా తెలుసూ కాబట్టి దాన్ని ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవాలి. ఎవరైనా కోపంతో ఊగిపోతున్నప్పుడు ఇవతలి వారు మౌనం వహించడం మేలు. కోపిష్టి వ్యక్తులతో ఇంటా, బయటా కష్టమే! అందుకే మనసును మన అదుపులో ఉంచుకోవాలి. నా మనసు చెప్పినట్లు నేను నడుచుకుంటానని భావిస్తే, చిక్కుల్లో పడటం ఖాయం.
Wednesday, 7 October 2015
"తెలుగు సినిమా"
పాత తెలుగు సినిమాలలో మంచి కథ, నీతి, మితిమీరని శృంగారం, వినసొంపయిన మధురమైన పాటలు, సున్నితమైన హాస్యం ఉండేవి. నాయికా నాయకులు నీతిని బోధించే పాత్రలు ధరించేవారు. అవినీతి, చెడుపై విజయంగా మంచి నీతిని ప్రబోధించేవారు. ఆ దిశగా రచయితలు కూడా రచనలు చేసేవారు. వాటి ప్రభావం సమాజంపై ఉండేది. మంచిని చూపించడంవల్ల ప్రజలకు సినిమాలపైన మంచి అభిప్రాయం ఉండేది. కానీ, నేడు వస్తున్న సినిమాలలో అతి జుగుస్సాకరమైన మాటలు, వస్త్రధారణ, సన్నివేశాలు, పోరాటాలతో దేశంలోని చెడునంతా నింపేస్తున్నారు. కేవలం యువతను దృష్టిలో పెట్టుకొని సినిమాలు నిర్మిస్తున్నారే తప్ప, అన్ని వర్గాల పేక్షకులను ఉపయోగపడే సినిమాలను నిర్మించడం లేదు. దాంతో కుటుంబసమేతంగా సినిమాలు చూసే అవకాశం లేకుండా పోతోంది.
Monday, 5 October 2015
Thursday, 1 October 2015
Tuesday, 29 September 2015
Sunday, 27 September 2015
Saturday, 26 September 2015
వీధి కుక్కల బెడద !
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ వున్న నగర శివారు ప్రాంతాలలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రదానంగా కాలనీలలో వీధి కుక్కల సంచారంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ చూసినా గుంపులుగా సంచరిస్తూ, వింత అరుపులతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి కాటుకు గురవుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి రోజు ఏదొక చోట కుక్క కాటుకు గురయిన వార్తలే వినిపిస్తున్నాయి. అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కుక్కల నియంత్రన కోసం చర్యలు తీసుకున్నట్టు కనబడటం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని కుక్కల నియంత్రణకు తగు చర్యలు చేపడితే బాగుంటుంది.
Monday, 21 September 2015
Saturday, 19 September 2015
Thursday, 17 September 2015
ఓల్డ్ ఈజ్ గోల్డ్ !
గతంలో పెళ్లిళ్లు కొబ్బరాకు, నేరేడాకులు, మామిడాకులు పందిరి కింద మనోహరంగా జరిగేవి. అతిధులు పచ్చని ఆకులు సువాసనలను ఆస్వాదిస్తూ...చక్కటి అనుభూతిని పొందేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని షామియానాలు ఆక్రమించుకోవడంతో అ అనుభూతిని కోల్పోతున్నాం. పెళ్లి భోజనం కుడా అరిటాకుల్లో సాంప్రదాయకరమైన వంటల్ని ఆరగించేవారు. ఇప్పుడు వాటి స్థానంలో ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ ఇస్తరాకులు, బఫే పేరిట ఆరోగ్యాన్ని పాడుచేసే రకరకాల వంటకాలు.... అందుకేనేమో 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అన్నారు పెద్దలు.
Wednesday, 16 September 2015
Monday, 14 September 2015
చిన్న విగ్రహాలను ప్రతిష్టించు ...పర్యావరణాన్ని కాపాడు !
వినాయకుడిని పూజించడానికి పెద్ద విగ్రహాలు ప్రతిష్టించాల్సిన అవసరం లేదు. విగ్రహం ముప్పయ్ అంగుళాలు ఉంటే చాలు. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు వాడని చిన్న మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తే బాగుంటుంది. గణేష్ విగ్రహాలు పోటిపడి భారీ స్థాయిలో ప్రతిష్టించి, మైకులు, డి.టి.ఎస్ సౌండ్లతో చుట్టుపక్కల వారికి ఇబ్బంది కలిగించగుండా తగుజాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. మండపాన్ని అలంకరించే సీరియో బల్బులు, ఫ్లడ్ లైట్స్ చూడటానికి అందంగా కనిపిస్తాయి. కాని, వాటికి ఉపయోగించే కరెంటు మాత్రం పబ్లిక్ గా విద్యుత్ చౌర్యం చేయకుండా విద్యుత్ అధికారులను సంప్రదించి, తగిన పైకం చెల్లించి విద్యుత్ ను వాడుకుంటే బాగుంటుంది. విద్యుత్ అధికారులు సూచించిన నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి. ఇంట్లో ప్రతిష్టించే వినాయక విగ్రహాలను రసాయనాలను ఉపయోగించనివిగా, సాధ్యమైనంతవరకు చిన్నవిగా ఉండేటట్లు చూసుకోవాలి. మట్టి విగ్రహాలను పసుపు, కుంకుమ, పూలతో అలంకరించితే చూడముచ్చటగా ఉంటాయి. పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని రంగులు ఉపయోగించని విగ్రహాలను ప్రతిష్టించి జలాశయాలను కలుషితం కాకుండా, అందులోని జల పుష్పాలకు హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
Sunday, 13 September 2015
మన తెలుగు టీవీ ఛానల్స్ !
ఈ మధ్య వస్తున్న టీవీ సీరియల్స్ చూస్తుంటే...అసలు మనుషుల మధ్య సత్సంబంధాలు, కుటుంబసభ్యుల మధ్య అభిమానాలు ఉండావా ? ప్రపంచమంతా మెచ్చుకునే మన కుటుంబ వ్యవస్థ విలువలేమయ్యాయి ? అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే మన తెలుగు టీవీ సీరియల్స్ లో మగాడికి రెండు పెళ్లిళ్లు, వివాహేతర సంబంధాలు, అత్తాకోడళ్ళు, తోడికోడళ్ళ మధ్య పోరు, పగలు, ప్రతీకారాలు. డానికి తోడు కుట్రలు కుతంత్రాలు...మంత్రం తంత్రాలు.
చిన్న పిల్లల చేత పిచ్చి డ్యాన్స్ లు, అసభ్యకరమైన దుస్తులు వేయించడం. హాస్య కార్యక్రమం పేరుతొ మగవాళ్ళు ఆడవేషాలు వేస్తూ, ద్వంద అర్థాలతో కూడిన డైలాగులతో హాస్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఒకరునొకరు కొట్టుకోవడం, జడ్జీలు విరగపడి నవ్వడం... ఇవ్వన్నీ చూస్తుంటే మనకు పిచ్చి ఎక్కడం ఖాయం.
Friday, 11 September 2015
గణేష్ ఉత్సవాల సందడి !
వినాయకచవితికి చందాలు వాసులు చేసే కార్యక్రమం మొదలయింది. నిర్వహకులు పెద్ద విగ్రహాలను ప్రతిష్టించాలని చూస్తున్నారు తప్ప, తర్వాత ఏర్పడే పర్యావరణ కాలుష్యాన్ని గురించి ఆలోచించడం లేదు. వినాయకుని విగ్రహాలు ప్రతిష్టించే వారు ఎత్తు తక్కువున్న మట్టి గణనాథులను ప్రతిష్టిస్తే, పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు చేతి వృత్తుల వారికి సహకారం అందించిన వారవుతారు. కొందరు వెకిలితనంతో వినాయకుడు ఫిడేల్ వాయుస్తున్నట్టుగా, మద్దెల మోగిస్తున్నట్టుగా, మోటారుసైకిల్ మీద వెడుతున్నట్టుగా ఎవరి వంకర బుర్రకు ఏ ఆలోచన తడితే ఆ తీరుగా వినాయకుడుని తయారుచేస్తూ మహా అపచారం చేస్తున్నారు. ఈ విపరీత ధోరణి మారాలి. గణనాథుడు ఎలా ఉంటాడో అలా తయారు చేసిన వినాయకుడుని ప్రతిష్టించి, భక్తిశ్రద్దలతో పూజించి మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడండీ. పండుగలు, ఉత్సవాలు సమాజహితాన్ని కోరాలి. గణేష్ నవరాత్రులు పూర్తిగా భక్తీ ప్రధానంగా, సమాజహితంగా నిర్వహించబడాలి. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి, శబ్ధ కాలుష్యాన్ని నివారించి, పర్యావరణానికి హాని కలుగకుండా చూడాల్సిన బాధ్యత మనపైన ఉందని మరచిపోకూడదు.
Thursday, 10 September 2015
Tuesday, 8 September 2015
Saturday, 5 September 2015
Friday, 4 September 2015
గురుదేవులకు వందనాలు !
అక్షరజ్యోతుల్ని వెలిగించి ...
విజ్ఞానాన్ని అందిస్తూ ...
క్రమశిక్షణ నేర్పిస్తూ ...
విద్యార్థుల లక్షసాధనకు
పునాది వేసేవారు
విద్యార్థి వ్యక్తిత్వం, ప్రవర్తనపై
బలమైన ముద్రవేసేవారు
గురువులు !
విద్యార్థులలో స్పూర్తిని నింపి
విజయం వైపు నడిపిస్తూ ...
తమలో దాగివున్న
గొప్ప విషయాలను బోధిస్తూ ...
భావితరాలను తీర్చిదిద్దుతున్న
గురుదేవులకు వందనాలు !!
Subscribe to:
Posts (Atom)