వృద్దులు అమృత హృదయులు. వారు తమ సంతానాన్ని బాల్యంలో ఎంత చక్కగా
సంరక్షించారో అంతకంటే ఎక్కువగా వృద్ధాప్యంలో వారిని జాగ్రత్తగా
కాపాడుకోవాలి. వృద్దాప్యంలో వారిని నిర్లక్ష్యం చేసి శోకించే స్థితి
కల్పించకూడదు. అందరూ ఉండి కూడా చాలా మంది వృద్దులు అనాదాశ్రయాలలో బిక్కు
బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వారిని కష్టపెట్టడం ఇంటికి క్షేమం కాదు...
మనకు మంచిది కాదు. మన జీవితం వారు పెట్టిన బిక్షం. వారి ఋణం
తీర్చుకోవడానికి ఈ జన్మ సరిపోదు. మన కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు
కాబట్టి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడం మన ధర్మం. వారు ఎన్నో భాదలు
అనుభవించి చనిపోయిన తరువాత ఘనంగా పితృకర్మలు ఆచరించే కంటే, వారు
బ్రతికుండగా వారిని అక్కునచేర్చుకుని సంతోషపెట్టడం అన్ని విధాల సముచితం.
పెద్దలను పుజ్యునీయులుగా చూడలేని వారు దైవారాధన చేయడం శుద్ధ దండగ.
No comments:
Post a Comment