మహిళలు ఏ రంగంలో నైనా పురుషులకు దీటుగా తమ సత్తా చూపిస్తున్నారు. కానీ సినిమా రంగంలో మాత్రం అందుకు బిన్నంగా ఉంది. స్త్రీ పురోగతి, పురోభివృద్ది మన తెలుగు సినిమాలమో అసలు కన్పించవు. ఎంతసేపు హీరోహిన్ అనబడే స్త్రీమూర్తిని నటనలో ఆటబొమ్మగా, పాటలలో శృంగారతారగా ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య ఇంకొక అడుగు ముందుకేసి ఐటెంసాంగ్ అనే పేరుతో హీరోయిన్స్ చేత అభ్యంతకరమైన డ్రస్సులు, డ్యాన్సులు వేయిస్తున్నారు. మన దర్శకనిర్మాతలు సమాజానికి ఉపయోగపడే చిత్రాలు నిర్మించకపోయినా పర్వాలేదు. కనీసం సమాజాన్ని నాశనం చేసే సినిమాలు నిర్మించకుంటే చాలు. వాళ్ళ కున్న క్రియేటివిటీని మంచి సినిమాలను రూపొందించడానికి ఉపయోగించాలి కానీ, డబ్బు కోసం చెత్త సినిమాలు తీసి సమాజాన్ని చెడకొట్టవద్దు. సంఘంలో ప్రతి మనిషికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. కానీ, సినిమాలు తీసే వాళ్ళకి ఇలాంటి కట్టుబాట్లు లేకపోవడం శోచనీయం. సమాజం పైన కనీస భాద్యతలు లేవు. ప్రతి విషయాన్ని డబ్బుతోనే చూస్తారు... డబ్బుకోసం వ్యంగ్య, బూతు సినిమాలను తీస్తూనే ఉంటారు. ఒకసారి పాత సినిమాలను చూడండి. ప్రతి సినిమాలో ప్రజలకు ఉపయోగపడే ఎదోక సందేశం ఉంటుంది. ఇప్పటికైనా సినీ పెద్దలు మేల్కొని స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని, ఔనత్యాన్ని ఉన్నతంగా చూపించే చిత్రాలు నిర్మిస్తే సమాజం హర్షిస్తుంది.
No comments:
Post a Comment