చేతిలో డబ్బుంటే చాలు అన్ని కొనగలం. కాని, స్వచ్చమైన గాలి దొరకడం కష్టం. అందుకే కొందరు స్వార్థపరులు సంపాదనలోపడి పంచభూతాలను అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికే భూమి, నీటిని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పుడు గాలి వంతు వచ్చింది. గాలి లేనిదే శ్వాస ఆడదు. అందుకే కొందరు బడాబాబులు గాలిని క్యాష్ చేసుకోవడానికి ప్రణాలికలను రచిస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలతో , వాహన, జల వనరుల కాలుష్యంతో గాలిని కలుషితం చేస్తున్నారు. వీరి చర్యల వల్ల నగర జీవులకు స్వచ్చమైన గాలి కరువయిపోయింది. వాతావరణ సమతుల్యం దెబ్బతిని జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. దాని ఫలితమే నేడు వర్షాకాలం వచ్చి 40 రోజులు గడుస్తున్నా వాన చినుకు రాలడం లేదు. ఇప్పటికైన ప్రభుత్వాలు మేల్కొనకపోతే మానవులు జీవించాలంటే గాలిని కొనక తప్పదు. దుకాణాల దగ్గర 'గాలి అమ్మబడును' అని బోర్డులు దర్శనమిస్తాయి. ఈ పరిస్థితే కనుక వస్తే జంతువులు, పక్షులు మన కంటికి కానరావు. తలుచుకుంటేనే శరీరం జలదరిస్తోంది కదూ!
No comments:
Post a Comment