దంపతుల మద్య కలహాలు నీటిలో కెరటాల్లాంటివి. అవి అలా వచ్చి ఇలా పోతుంటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కలహాలు వస్తేనే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలరు. వాళ్ళ అనుబంధం మరింత దృఢ పడుతుంది. ఏ అమరికలకు తావులేకుండా అన్యోన్యంగా ఉంటారు. అయితే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు ఆరోగ్యకరంగా ఉండాలి. చిలికి చిలికి గాలివాన కాకుండా జాగ్రత్త పడాలి. కొందరు 'మా దంపత్యజీవితంలో గోడవలు లేవు' అని గొప్పలు చెబుతూ ఉంటారు. ఇది పచ్చి అబద్దం. ఎందుకంటే భార్యాభార్తలన్నాక ఏదోక విషయంలో ఎప్పుడో ఒకప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సహజం. అసలు కలహాలు లేని దాంపత్యం ... దాంపత్యమే కాదు. సంసారంలో అలకలు, బ్రతిమాడుకోవడాలు ఉంటేనే, దాంపత్యానికి నిండుదనం వస్తుంది. ఆలుమగల బంధం జీవితకాలం కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి ... వారి మధ్య వచ్చే కలహాలు హుందాగా ఉండాలి. ఘర్షణను మాటలవరకే పరిమితం చేయాలి. అప్పుడే దాంపత్య జీవితంలో చక్కని ఫలితాలను పొందగలుగుతారు.
No comments:
Post a Comment