మనిషిలో ద్వేషం, ఈర్ష్య పెరగడం ద్వారా విజ్ఞత లోపిస్తుంది. మానవత్వం అడుగంటి పోతుంది. దాంతో అహం పెరిగి కన్నుమిన్ను కానరాకుండాపోతాయి. ఎప్పుడయితే మనిషిలో అహంకారం ప్రారంభమవుతుందో ... అప్పటి నుంచి అతని పతనం కూడా మొదలవుతుంది. స్వార్థ బుద్ధి, తెలియని ఆశ వెంతాడుతుండటం వల్లనే నీచమైన అలవాట్లు మనసులో చోటు చేసుకుంటాయి. దాంతో వ్యకిత్వం దహించుకు పోతుంది. అహంకారం వున్న వ్యక్తిలో విచక్షణా జ్ఞానం కొరవడుతుంది. తద్వారా రాక్షసులుగా మారిపోతారు. 'నేను' అనే అహం సర్వ సమస్యలకు మూలకారనమవుతుంది. అహంకారపూరిత చేతలకు ప్రతి వ్యక్తి దూరంగా ఉంటేనే, మనస్సు ప్రశాంతంగా, స్వచ్ఛంగా, స్థిరంగా ఉంటుంది.
No comments:
Post a Comment