Saturday, 30 November 2013
Wednesday, 27 November 2013
"తల్లీ- కూతుళ్ళు"
"అమ్మా... మీ అల్లుడు రాత్రిపూట లేటుగా వస్తున్నాడే!"
"నా పెళ్ళయిన కొత్తలో మీ నాన్నగారూ కుడా ఇలాగే ఆలస్యంగా వచ్చేవాడు తెలుసా?"
"ఆ అలవాటు ఎలా మాన్పించావ్?"
"ఏముంది ఓ రోజు అర్థరాత్రి వచ్చి తలుపు కొట్టాడు 'మా వారు వచ్చే వేళయింది' అన్నాను. అంతే---
ఆ మర్నాడు నుంచి చీకటి పడగానే బుద్దిగా ఇంటికి వచ్చేవాడు.
Sunday, 24 November 2013
"కొంటె కూతురు"
అల్లుడికి దెబ్బలు తగిలి ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడని కబురు వస్తే హడావుడిగా వెళ్ళిన అత్తగారు 'అసలేమయింది అల్లుడు గారూ... ఏక్సిడెంటా?' అని అడిగితే,
తన భార్యవైపు చూపించాడు అల్లుడు
'ఎమైందో నువ్వైనా చెప్పవే' అని కూతుర్ని అడిగితే.
'నువ్వేకదమ్మా ఆయనితో ఏమైనా తేడా వస్తే నోరు విప్పవోద్దన్నావు- అందుకే చేతికి పని చెప్పా'
అంది కొంటెకూతురు.
Friday, 22 November 2013
మాయల మరాఠీలు!
మన నాయకులు
మాయల మరాఠీలు
మాయమాటలతో
ప్రజలను ఏమార్చి
పబ్బం గడుపుకునే
ఘనాపాటీలు!
పదవికోసం
ఎన్నో వేషాలు
గడ్డి తినడానికే
ఎన్నోమోసాలు
అందుకే ...
దేశం పతనం వైపు
పరుగులు తీస్తోంది
మాయల మరాఠీలు
మాయమాటలతో
ప్రజలను ఏమార్చి
పబ్బం గడుపుకునే
ఘనాపాటీలు!
పదవికోసం
ఎన్నో వేషాలు
గడ్డి తినడానికే
ఎన్నోమోసాలు
అందుకే ...
దేశం పతనం వైపు
పరుగులు తీస్తోంది
Saturday, 16 November 2013
కార్తీక పౌర్ణమి
దీపావళి పండుగ అనంతరం మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలో వచ్చే పున్నమి చాలా పవిత్రమైనది. అందుకే ఈ రోజున పూజలు, అభిషేకాలు, వ్రతాలు, దీపారాధనలతో గృహాలు, దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు శివాలయాలలో దీపారాధన చేయడం వలన ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం కలుగుతుందని భుక్తుల విశ్వాసం. ఈ రోజున మహిళలు 365 వత్తులతో ప్రీతికరంగా దీపాలను వెలిగిస్తారు. కార్తీకమాసం శివకేశవులకు అత్యంత ప్రీతికర మైనందువల్ల ఆన్ని దేవాలయాలలో దీపాలను వెలిగిస్తారు.
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు!
Wednesday, 13 November 2013
శివార్చన..!
తెలుగు మాసాలలో కెల్లా కార్తీకమాసం అత్యంత పవిత్రమైనది. కార్తీకమాసం అనగానే మనకు గుర్తుకొచ్చేది సోమవారం. శివునికి సోమవారం, రుద్రాక్షాలు, అభిషేకం, బిల్వపత్రం అంటే చాలా ఇష్టం. ఈ మాసంలో పంక్షాక్షరి నామాన్ని పఠిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. విబూధిని ధరిస్తే అనంత ఐశ్వర్యం కలుగుతుంది. రుద్రాక్షరాలను స్పర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది.
ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ... ఓం నమశ్శివాయ
******
Tuesday, 12 November 2013
నవ్వితే నవ్వండి!
కొందరు ఏమీ లేకపోయినా ఎదోవున్నట్టు నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఓ భర్త తన భార్య దగ్గర గొప్పలు ఈ విధంగా చెప్పాడు.
భర్త : రాత్రి నా కలలో పక్కింటి లావణ్య కనిపించింది.
భార్య: ఆమె ఒక్కతే కినిపించింది కదా?
భర్త : ఈ విషయం నీకెలా తెలుసు?
భార్య : ఆమె భర్త నా కలలోకి వచ్చాడులే!
ఆ భర్తగారు కోలుకోవడానికి చాలా టైం పట్టింది.
Thursday, 7 November 2013
Friday, 1 November 2013
అందరికీ దీపావళి శుభాకాంక్షలు!
ఏ శుభకార్యానికైన దీపం వెలిగించిన తర్వాతనే పూజ ప్రారంభిస్తాం. దీపావళి పర్వదినాన ఇంట , బయట దీప జ్యోతుల వరుసలతోనే దీపావళి ఆరంభమవుతుంది. దీపం వెలుగుకు, జ్ఞానానికి ప్రతీక. అమావాస్య చీకట్లను పారద్రోలుతూ ఇండ్ల ముందు, పూజా గృహంలో వెలిగే దీపాల వరసలు సర్వ శుభాలను అనుగ్రహిస్తాయి. ఈ రోజు లక్ష్మిదేవిని పూజించడం కృతయుగం నుండి వస్తున్నా సంప్రదాయం. శ్రీ మహాలక్ష్మిని కొలవని, ధ్యానించని ఇల్లూ, వాకిలి ఉండవు. మనం అనుభవించే సిరిసంపదలు ఆ తల్లి ప్రసాదించినవేనని మనందరికీ తెలుసు. ఆదేవిని స్తుతించినా, పూజించినా ఆమె అనుగ్రం మనికి తప్పక లభిస్తుంది. తద్వారా సకల సంపదలు మన సొంతమవుతాయి. దేశమంతా ఆనందోత్సాలతో జరుపుకునే దీపావళిని వెలుగు తోరణాలతో, వెలుగులుచిమ్మే బాణాసంచాతో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఘనంగా జరుపుకుంటాం.
Subscribe to:
Posts (Atom)