”శోధిని”

Wednesday, 17 July 2013

నీటి వ్యాపారం !


భూగర్భజలాలు కలుషితం, నీటి కొరత, కలుషిత నీటి సరఫరా కారణంగా ప్రజలు నీటిని కొనుక్కునే దుస్థితి వచ్చింది.  దీన్ని అవకాశంగా తీసుకున్న కొందరు మినరల్ వాటర్ పేరిట అక్రమ దందాను మొదలు పెట్టారు. దాంతో అక్రమ నీటి వ్యాపారం కాసులు కురిపిస్తోంది.  పట్టించుకోవాల్సిన అధికారులు పట్టించుకోక పోవడంతో వీరికి బాగా కలిసొచ్చింది.  చాలా చోట్ల అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నీటి శుద్ధి కేంద్రాలు వెలుస్తున్నాయి. రాబోయే ఎన్నికలను దృష్టి లో పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు తమ పార్టీ గుర్తుతో ఇంటి  దగ్గరకొచ్చితక్కువ ధరకు నీటిని సరఫరా చేస్తున్నారు. అనుమతులు అటుంచి కనీసం నీటి శుద్దిలో నైనా ప్రమాణాలు పాటించడం లేదు. కొందరయితే మార్కెట్లో  బాగా పేరున్న  కంపెనీల లోగోలను క్యాన్ల పైన, బాటిల్ల పైన  ముద్రించి సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు.  ఫ్యూర్ ఫయ్డ్ వాటర్ ని మినరల్ వాటర్ అని నమ్మించి, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.  తక్కువ   పెట్టుబడితో  అధిక లాభాలు రావడంతో చాలా మంది ఈ వ్యాపారంలోకి దిగుతున్నారు.ప్లాంట్లకు అనుమతులు,  నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా నీటి వ్యాపారం చేస్తున్నారు.  నగర శివారు గ్రామాలను ఎన్నుకొని ఈ దందాను నిర్వహించడంతో ప్రభుత్వ అధికారులు అటు వైపు కన్నెత్తి కుడా చూడటం లేదు ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోనంత కాలం ఈ అక్రమ నీటి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉంటుంది. 
  

No comments: