”శోధిని”

Tuesday, 30 April 2013

హైటెక్ మానవుడు!

నేడు మానవ సంబంధాలు 
ఆర్ధిక సంబంధాలుగా 
మారి పోతున్నాయి
ఆస్తిని పెంచుకుంటూ 
పరుల గురించి 
ఆలోచించడం మానేస్తున్నారు 
ఇంటి వైశ్యాల్యం పెంచుకొంటూ...  
హృదయ వైశ్యాల్యం
తగ్గించుకుంటున్నారు 
కానరాదు ఎక్కడా మానవత్వం 
అణువణువునా క్రూరత్వం 
భోగభాగ్యాలు శాశ్వతం కాదని 
సమాజంతో సత్ సంబంధాలు 
ఇరుగు పొరుగు వారితో 
కలిసి ఉండటం మఖ్యమని 
ఈ హైటెక్ మానవుడు 
తెలుసుకునేదేప్పుడో!

2 comments:

పల్లా కొండల రావు said...

డబ్బుకు 'విలువ' లేకుండా 'విలువలకు' 'విలువ' వచ్చినప్పుడు.

కాయల నాగేంద్ర said...

ధన్యవాదాలు పల్లా కొండల రావు గారు.