నదిలో అలలు ఎంత సహజమో సంసారంలో కలతలు కూడా అంతే సహజం. అల ఎంత ఎగిరిపడినా నదిని విడిచి ఉండలేదు. అదేవిధంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినిఒకరు అర్థం చేసుకోవడంతో పాటుగా ఒకర్నిఒకరు పరస్పరం గౌరవించుకోవాలి. ఆధిపత్యం కోసం గొడవలు పడకూడదు. అన్నిటిని మించి ఇద్దరికీ సహనం ఉండాలి. ఒకరు కోపంతో ఉన్నప్పుడు మరొకరు శాంతంగా ఉండాలి. అప్పుడే ఆ సంసారం ముందుకు సాగుతుంది. సంసారంలో
ఎంతటి తీవ్ర స్థాయిలో కలతలు చోటు చేసుకున్నా భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకూడదు. వ్యక్తిగత విషయాలలో పరాయి వ్యక్తులకు తావివ్వకూడదు
భార్యాభర్తలు సరసాలు, చమత్కారాలకు దగ్గరగా ఉంటూ చిరాకులు, పరాకులకు దూరంగా ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ అనేది లేకుంటే భవిష్యత్తు శూన్యమనిపిస్తుంది. జీవితం
అందకారమవుతుంది. భర్తతో
ఆనందంగా జీవించాలంటే అతనిని అర్థం చేసుకోవడం ముఖ్యం. భార్యతో
సుఖంగా జీవించాలంటే ఆమెను ప్రేమగా చూసుకోవడం అవసరం.
No comments:
Post a Comment