మన రాష్ట్రంలో వర్షాకాలంలోనూ కరెంట్ కోట కొనసాగుతోంది. ఫలితంగా విద్యుత్ ను నమ్ముకుని జీవిస్తున్న వినియోగదారులు, పరిశ్రమ యజమానులు తీవ్రఆందోళనచెందుతున్నారు. ఎండాకాలం లో రోజుకు రెండు గంటలు కోట విధించిన అధికారులు , వర్షాకాలం వచ్చేసరికి ఒక సమయం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కరెంట్ ను నిలిపివేసి వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలతో సతమత మవుతున్న ప్రజలకు ఈ కోత వల్ల పుండుమీద కారం చల్లినట్టుంది.ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.
మన పాలకులు ఎంతసేపు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే చూస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోంది. హైదరాబాద్ నుంచి డిల్లీ కి ఎన్ని సార్లు చక్కర్లు కొట్టినా, ఏనాడు అయినా ప్రజా సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడినట్టు కనిపించిన దాఖరాలు లేవు. ఎప్పుడూ "జగన్ ని ఎలా కట్టడి చేయాలి? తెలంగాణా లో పార్టీని ఎలా బ్రతికించుకోవాలి? 2014లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి?"అని ఆలోచిస్తున్నారే కానీ, ప్రజల సమస్యల గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలి.
7 comments:
ప్రశ్న: వర్షాకాలంలో కరెంట్ కోతలా?
జ: ఇది ఒక వర్షాకాలం లాగా ఉందా ఇప్పటివరకు?
ఉక్తి: 2014లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి?"అని ఆలోచిస్తున్నారే ..
వ్యాఖ్య: ఎన్నికలలో గెలిచిన వారు మళ్ళీ గెలవాలనే గదా ఆలోచిస్తారు?
ఉక్తి: రజల సమస్యల గురించి అసలు పట్టించుకోవడం లేదు.
వ్యాఖ్య: ఎప్పుడు పట్టించుకున్నారు ఇంతకు ముందు అయినా?
ఉక్తి: ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలి.
వ్యాఖ్య: మీరు పాతకాలంలో ఉన్నారు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే ప్రజల ఓట్లు సంపాదించే మార్గాలు అన్వేషించాలి. మంచి చేస్తే ఓట్లు పడతాయని అనికోవటం ఉటోపియన్ థింకింగ్. నిజం కాదు.
సాంకేతికంగా చూస్తే వర్షాలతో నీటిమట్టం కావలసినంత పెరగకపోవటం...
మిగిలినవి మీరన్నట్లుగా...
స్వార్థ రాజకీయాలు.
విద్యుత్ దొంగతనం...(మీటర్లు లేకుండా),
రెండవది ఒక లైటు కనెక్షన్ అని సబ్సిడీ తో కనక్షన్ ఇస్తే..
దాంతో ఏసీలు కూడా పని చేస్తున్నాయి...
అన్నీ కలిపి పడే భారం మన నెత్తినే...
@శ్రీ
karantu vaadatam teleedandee chaalaa mandiki, anduke ee kothalau anukuntaa, naagendra gaaroo ilaa panikochevannee elaa kanipedateerandee meeru.
శ్యామలీయం గారు, మీ ప్రశ్నల వరదతో ఉక్కిరిబిక్కిరి చేసారు. మీ అమూల్య మైన స్పందనకు ధన్యవాదాలు.
మీ కామెంట్ తో ఏకీభవిస్తున్నాను 'శ్రీ' గారు!
మీ స్పందనకు ధన్యవాదాలు పాతిమ గారు!
శ్యామలీయం గారు, భాగా చెప్పారండి.ఈ రోజుల్లో ప్రజల కష్టనష్టాలెవరికి కావాలండి? ఎవరి స్వార్ధం వారిది.
Post a Comment