”శోధిని”

Saturday, 14 July 2012

రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తున్న 'ఈగ'





        దర్శకుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'ఈగ' చిత్రం జూలై 6 న విడుదలై అద్భుతమైన ఓపెనింగ్స్ తో రాష్ట్రమంతా 'హల్ చల్' చేస్తోంది.  'ఈగ' సంచలన విజయాన్ని సాధించడంతో, త్వరలో విడుదల కావలసిన చిత్రాల తేదీలు చక చక ముందుకు మారి పోయాయి.  కొందరయితే అసలు విడుదల తేదీని ప్రకటించడానికే భయపడుతున్నారు. 'ఈగ' దెబ్బకు ఇలా వాయిదా పడ్డ చిత్రాలలో "జులాయి", "దేవుడు చేసిన మనషులు",   'ఊకొడతారా --ఉలిక్కి పడతారా", "డమరుకం"  లాంటి పెద్ద చిత్రాలు కూడా ఉండటం విశేషం.

        ఒక చిత్రం విడుదలయి విజయం సాధిస్తే ఆ క్రెడిట్ అంతా 'హీరో'దేనని అభిమానులు నానా హంగామా . 'ఈగ' చిత్రం చూసాక తెలిసిందేమిటంటే, విజయానికి ప్రధాన కారణం దర్శకుడేనని.  పెద్ద స్టార్స్ లేకుండా కేవలం ఒక ఈగనే నమ్ముకుని ఈ చిత్రాన్ని నిర్మించిన రాజమౌళి నిజంగా దమ్మున్న దర్శకుడు. సినిమా విజయం సాధించడానికి దర్శకుడే  ముఖ్యమని ఈ చిత్రం రుజువు చేసింది.  ఈ చిత్రంలో యామినేషన్ ప్రక్రియ పిల్లలను రంజింప చేస్తే, పెద్దలను కూడా ఆకట్టుకునే విధంగా రూప కల్పన చేయడంలో రాజమౌళి విజయం సాధించాడు.

        విలన్ గా  నటించిన కన్నడ నటుడు సందీప్ నటన 'ఈగ' చిత్రానికి హైలెట్.సమంత కు మంచి గ్లామర్ పాత్ర దొరికింది.  నాని ఉన్నంత సేపు తెరపై మంచి నటనను కనబరచాడు.  కథ విషయానికొస్తే హీరోని చంపిన విలన్ పై పగతీర్చు కోవడానికి 'హీరో' ఈగగా  పుట్టడం. కథ చిన్నదే అయినా దాన్ని తెర పైన చూపించిన  విధానం ప్రశంసనీయం.  గ్రాఫిక్ ఈగను సృష్టించి , దాని చేత రకరకాల విన్యాసాలు చేయించడంలో రాజమౌళి మరో విఠాలాచార్యలా వైవిద్యం ప్రదర్శించాడు. హాలీవుడ్ తరహాలో టాలీవుడ్ కూడా గ్రాఫిక్ చిత్రాలను నిర్మించ గలదని స్పష్టం చేసిన రాజమౌళి అభినందనీయుడు.  ఈగ చిత్రాన్ని ఒక థ్రిల్లర్ గా , ఎంటర్ టైనర్ గా  రూపొందించడంలో రాజమౌళి నూటికి నూరు శాతం విజయం సాధించాడు. పిల్లలతో కలసి పెద్దలు చూడాల్సిన  చిత్రం 'ఈగ'.

4 comments:

జలతారు వెన్నెల said...

నేను చూసాను ఈగ సినిమా. నాకు కూడా నచ్చింది నాగేంద్రగారు.
ఇక్కడ చాలా బాగా ఆడుతుంది సినిమా.

శ్రీ said...

మీరు వ్రాసిన సమీక్ష బాగుంది నాగేంద్ర గారూ!
రాజమౌళి చిత్రంలో...కథ,కథనం,రాజమౌళి ఈ ముగ్గురే హీరోలు...
పథ సినిమాలలో కూడా ఈ విషయం స్పష్టమైంది...
చాలా బాగుంది సినిమా...
@శ్రీ

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు వెన్నెల గారు!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు 'శ్రీ' గారు!