
రాష్ట్రంలోఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఇక ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమం మొదలయింది. తాయిలాలు ఓటర్లకు అందించడానికి సిద్దమయ్యారు. ఆడవారికి చీరలు, ముక్కుపుడకలు, మగవారికి మద్యం, డబ్బు, గల్లీ నాయకుడికయితే స్కూటర్, సెల్ ఫోన్, ఇంటికో బస్తా బియ్యం ఇలా కోట్లాది రూపాయలు మంచి నీళ్ళలా ఖర్చు చేసున్నారు. ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి. ఓటును అమ్ముకోవడం మన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. ఓటు మన జన్మ హక్కు. దాన్ని వినియోగించుకోవడం మన కర్తవ్యం. ఎంతో విలువైన ఓటును మద్యానికి, డబ్బుకు ఆశపడి అమ్ముకోవడం అంత నీచమైన పని మరొకటిది ఉండదు.
10 comments:
enikalalo,
dabbu kattalu,
angadi sarukaindi,
adhikaram.
o chinna nanni.
నాని రూపేనా కామెంట్ పెట్టేసారు భాస్కర్ గారు.
కష్టమండి ఫ్రీ గా ఇచ్చే వాటిమీద ఆశపడకుండా ఉండటం.
మీరెప్పుడన్నా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ అంటే,జనం ఎలా ఎగబడతారో చూసారా?
ఈ ఓట్లు అమ్మకాలు, కొనుగోలు ఆగాలంటే, law strict gaa action తీసుకోవాల్సిందే!
అలా law strict గా అయ్యేదెప్పుడంటారు?
మన పాలకులు నీతిమంతులు అయినప్పుడు తప్పకుండా మార్పు వస్తుంది.
మీ స్పందనకు ధన్యవాదాలు!
/ఇచ్చేవారికి బుద్ది లేకపోయినా, తీసుకునే వారికైనా ఉండాలి/
ఎంతమాటన్నారండి? మనం తీసుకోకుంటే ఇచ్చేవాడికి ఇచ్చేదురదెలా తీరేది?! మనం తీసుకోనంత మాత్రాన వాడు ఇవ్వడా, తీసుకునేవాళ్ళుండరా?
అందరి దగ్గరా అందినంత తీసుకోవాలి, ఓటు కూడా ఇచ్చినోళ్ళందరి గుర్తులపైనా సమన్యాయం పాటించి గుద్దాలి, అదే న్యాయం. :))
> ఇచ్చినోళ్ళందరి గుర్తులపైనా సమన్యాయం పాటించి గుద్దాలి. అదే న్యాయం
అవునండోయ్. ఒక సారి, "డబ్బిచ్చినోళ్ళందరికీ వోటేసా" అన్న ముసలాయననూ చూసాను మరి.
నాగేంద్ర గారూ, అమాయక జనాలు ఇచ్చిన కొంచమే ఆశిస్తున్నారు కాని పోగుట్టుకుంటున్న భవితను ఆలోచించటం లేదు.
మీ న్యాయం చాలా బాగుందండీ!
అవునండీ! ఇప్పటికీ చాలా చోట్ల ఇలాగే జరుగుతోంది.
అమాయక ప్రజలు చైతన్యవంతులయితే ఈ వ్యవస్థ కొంతయినా మారుతుంది.
Post a Comment