”శోధిని”

Monday, 4 June 2012

నాయకుడు



 వాడికి ఓటు వేసిన ప్రతిసారీ...
మనమే ఓడిపోతుంటాం
వాడేమో పైకి వెళ్లి 
మనకు చుక్కలు చూపిస్తాడు 
ఓటు కోసం మనల్ని అడుక్కుంటాడు 
వాడు మంత్రి అయ్యాక 
మనం అడుక్కోవాలి వాడ్ని
ఎన్నకలోస్తే కందిరీగలా...
మనచుట్టూ తిరుగుతాడు 
ఎన్నికలయ్యాక తునీగలా...
వాడి చుట్టూ మనం తిరగాలి 
ఎన్నికల ముందు కురిపిస్తాడు వరాలు 
తర్వాత మనకు పట్టిస్తాడు చెమటలు 
ప్రజా సమస్యల్ని వాగ్ధానాలుగా మార్చి 
పదవికోసం ఎటయినా దూకుతాడు 
ఊసరివెల్లిలా రంగు దుస్తులు మార్చుతూ... 
అవకాశం కోసం గోడమీది పిల్లిలా ...
నిత్యం ఎదురు చూస్తుంటాడు
పెద్ద ఆఫర్ రాగానే గోడ దూకేస్తాడు 
ఇలాంటి వాళ్ళని కంట కనిపెట్టాలి 
ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పాలి.

2 comments:

జలతారు వెన్నెల said...

బాగుంది. నిజమే, గుణపాటం చెప్పలి. కాని అలా జరగటం లేదే! జరగాలని ఆశిద్దామండి!

కాయల నాగేంద్ర said...

మీ స్పందనకు ధన్యవాదాలు!